కమల్ హాసన్ భారతీయుడు సినిమా చూసే ఉంటారు.  అందులో సేనాపతిగా కమల్ హాసన్ పోషించిన పాత్ర ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.  దేశంలో అవినీతి, లంచం అనేవి ఎంతగా పాతుకుపోయాయో.. వాటి వలన ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో చూపించారు.  లంచం అడిగేవారికి సేనాపతిగా ఎలా బుద్దిచెప్పారు చూపించారు.  అలాంటి కమల్ హాసన్ చేసిన పాత్రలాంటి పాత్రను ఇప్పుడు నితిన్ గడ్కారీ చేస్తున్నారు.  అది సినిమాలో కాదు.. రియల్ లైఫ్ లో.. 


అదెలా అని షాక్ అవ్వకండి.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి ఇటీవల లఘు ఉద్యోగ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ లంచం అంశంపై మాట్లాడారు.  దేశంలో అవినీతికి లంచం మూలకారణం అని ఆ లంచాన్ని రూపుమాపే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చెప్పారు.  కేంద్రమంత్రి స్వయంగా లంచం గురించి మాట్లాడటం సంచలనంగా మారింది.  


లంచం అడిగిన వాళ్ళను ఏం చేయాలో చెప్పకనే చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలు అని, ప్రజల పనులు చేయడం వారి విధి అని చెప్పిన నితిన్, ఇటీవల కాలంలో ఏ పనికోసమైన లంచాలు అడుగుతున్నారనే కంప్లైంట్స్ వస్తున్నాయని, అలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యిందని చెప్పారు.  అంతేకాదు, లంచం అడిగే వాళ్ళ చెంప పగలగొట్టమని బహిరంగంగా చెప్పడం విశేషం.  


చాలామంది వ్యాపారవేత్తలు వ్యాపార అనుమతుల నిమిత్తం ప్రభుత్వ ఆఫీస్ లకు వెళ్తుంటే.. అక్కడ లంచాలు అడుగుతున్నారని, ఇవ్వని వాళ్ళను వివిధ రకాల పేర్లతో హింసిస్తున్నారని, లంచాలు అడిగే వాళ్ళ చెంప పగలగొట్టమని నితిన్ నిర్మొహమాటంగా చెప్పడం ఆసక్తిగా మారింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అందరి ముందు కొడితే కేసు అవుతుంది కదా.. మరి దాని పరిస్థితి ఏంటి.  అప్పుడు ఎవరు కాపాడతారు.  నితిన్ ఈ విషయాలను సీరియస్ గా చేశారా.. కేంద్రం నెక్స్ట్ స్టెప్ లంచం తీసుకునే వాళ్లపై పెట్టిందా అన్నది తెలియాలి.  ఒకవేళ నిజంగా కేంద్రం లంచం తీసుకునే వాళ్లపై దృష్టి పెడితే.. దేశంలో చాలా వరకు అవినీతిని అరికట్టినట్టే అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: