ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అనాలోచిత నిర్ణయాలూ కక్ష సాధింపు చర్యలు చూస్తుంటే నీరోచక్రవర్తి తలపిస్తున్నారని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. సాక్షాత్తు ముఖ్య మంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంతో పాటు చుట్టు పక్కల మూడు జిల్లాలు నీట మూలుగుతుంటే జగన్ విదేశాల్లో విహార యాత్రలు చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను రోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న కనీస జాగ్రత్తలు తీసుకోలేదంటూ ఆరోపించారు.


మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఇళ్లు నీట మునుగుతుంది చూడాలి అన్న పైశాచిక ఆనందంలో వైసీపీ నేతలు ఉన్నారని దుయ్యబట్టారు. ఆల్మట్టి నిండగానే శ్రీశైలానికి వరద నీరు వస్తుందని దానిని సాగర్ ద్వారా కిందకు వదులుతారని రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడని ఈ విషయం వైసీపీ మంత్రులకు తెలియక పోవడం సిగ్గుచేటని ఆందోళన వ్యక్తం చేశారు. వెల్లువలా వస్తున్న వరద నీటితో రాష్ట్రంలోని చెరువులను నింపుకోవాలి అన్న కనీస ఆలోచన వైసీపీ నేత లకు రాకపోవడం దారుణమన్నారు. ముంపునకు గురైన లంక గ్రామాల్లో పర్యటించాల్సిన మంత్రులు అక్కడ పనిచేయాల్సిన డ్రోన్ కెమెరాలూ చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతుండటం జగన్ చేతకాని పరిపాలనకు నిదర్శనమని విమర్శించారు. ఇంత వరకు వరద విషయంలో సమీక్ష నిర్వహించక పోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు క్యూసెక్కులకు టీఎంసీలకు తేడా తెలియని వారికి ఇరిగేషన్ మంత్రి పదవి ఇస్తే వరదలు రాక ఇంకేం వస్తాయంటూ జీవి మండిపడ్డారు సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ మాట్లాడుతూ జగన్ పరిపాలన చిన్న పిల్లల ఆట ని తలపిస్తోందని విమర్శించారు కరకట్టపై నలభై కిలోమీటర్ల మేర అనేక గాట్లు వరద ముంపున కు గురైన మంగళగిరి ఎమ్మెల్యే మాత్రం చంద్రబాబు ఇంటి చుట్టూనే తిరుగుతున్నార ని ఎద్దేవా చేశారు రెండు వేల తొమ్మిది లో శ్రీశైలానికి ఇరవై ఐదు లక్షల క్యూసెక్ కుల వరద నీరు వచ్చిన చిన్న ప్రమాదం కూడా జరగలేదని గుర్తు చేశారు.


ఇప్పుడు కేవలం ఆరు నుంచి ఏడు లక్షల నీరొస్తేనే రాష్ట్రాన్ని వరద ముంచెత్తుతోంది అంటే అది జగన్ పరిపాలన ఏంటో చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై రివర్స్ టెండరింగ్ పిలవడం కేవలం కమీషన్ లు దోచుకోవడానికే అంటూ ఆరోపించారు.ఈ విమర్శపై జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: