విజయవాడ టిడిపిలో ఇప్పుడు ఓ చర్చ నడుస్తోంది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ వీరిద్దరి మధ్య గొడవలకు కారణమేంటి. విజయవాడ అర్బన్ పార్టీ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయంలోకి మార్చాలని గతంలో నిర్ణయించారు. ఇదే మాటను ఇటీవల పత్రికా ప్రకటన ద్వారా చెప్పారు.


కానీ మళ్లీ ఏమైందో కాని అర్బన్ పార్టీ కార్యకలాపాలు కేశినేని భవన్ నుంచే కొనసాగుతాయనీ కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు ఉచ్చుల అర్జునుడు పేరుతో మళ్లీ ప్రకటన వచ్చింది.వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన విడుదలైన తరువాత నుంచి బుద్దా మీడియాకు కనిపించడం లేదు.


పార్టీ హైకమాండ్ పై ఆయన అలిగారని ప్రచారం నడుస్తోంది. అయితే కేసినేని, బుద్దా వెంకన్న మధ్య గొడవకు అసలు కారణం సీట్ ఫైట్ అని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న బుద్దా కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని ప్లాన్ వేస్తున్నారు.విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చెయ్యాలని అనుకుంటున్నారట. వెస్ట్ సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పోటీ చేస్తారని ఎంపీ కేశినేని ప్రకటించారు. పార్టీ అధినేతతో సంబంధం లేకుండా ఈ విషయాన్ని ప్రకటించడంపై బుద్దా అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. నాని అనుచరుల దగ్గర తన అసంతృప్తిని వెళ్లగక్కారట.


ఈ విషయం తెలిసిన నాని ట్వీట్ లతో విరుచుకుపడ్డారని ఇప్పుడు కొందరు తమ్ముళ్లు చెపుతున్నారు. దీంతో వీరి మధ్య ట్వీట్ ల యుద్ధం ఒక స్థాయిలో నడిచింది. ఈ విషయం తెలిసిన చంద్రబాబు వీరికి సంయమనం పాటించాలని సూచించారు.అధినేత ఆదేశాలతో ఇద్దరు నేతలు దక్కారు. సీట్ ఫైట్ తో పాటు కొంత మంది సీనియర్ నేతలు కూడా వీరి మధ్య గ్యాప్ కు కారణమని పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


కేశినేని, బుద్దా మధ్య కావాలనే కొందరు గ్యాప్ క్రియేట్ చేశారని దీంతో ఇద్దరు నేతలు ట్వీట్ ల ద్వారా వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లారనేది బెజవాడ నేతల మాట. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటించారు. కాని, బుద్దా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో నాని, బుద్దా ఎపిసోడ్ లో నెక్ట్స్ డే ఏం జరగబోతోంది అనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: