ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది.వైసీపీ విజయం సాధించిన తరువాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా 1,00,000 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఉండటం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరగటం వలన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే బోధన బాగుంటుంది. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అనేక సదుపాయాలను కల్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టం కూడా విద్యార్థుల సంఖ్య పెరగటానికి కారణంగా తెలుస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లోని ఫీజులు భారీగా ఉండటం కూడా విద్యార్థుల సంఖ్య పెరగటానికి ఒక కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాలల్లో ప్రవేశాలు పెంచటానికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం కూడా విద్యార్థుల సంఖ్య పెరగటానికి కారణమైంది. 
 
గతంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను మూసివేయటం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలు, బూట్లు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు బోధన పరంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మెరుగయ్యాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్న అమ్మఒడి పథకం కూడా విద్యార్థుల సంఖ్య పెరగటానికి కారణం అని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంలోకి వచ్చిన రోజు నుండి ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టారు. అధికారులతో సమావేశాలు జరిపి ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ధి కొరకు కృషి చేసారు. ప్రభుత్వం యొక్క కృషి వలనే ఇంత భారీ స్థాయిలో విద్యార్థులు పెరిగారని తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: