అమరావతి, శాసనమండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలకు నామినేషన్ దాఖలుచేసిన వైకాపా అభ్యర్థులు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యినట్లు సమాచారం. వీరిలో మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ ఇన్ఛార్జి కార్యదర్శి పి.బాలకృష్ణమాచారి నుంచి సోమవారం ధ్రువీకరణ పత్రాలు అధికారికంగా అందుకున్నట్లు తెలుస్తుంది. జగన్ మళ్ళీ మళ్ళీ తన సత్తా చాటుకుంటున్నాడు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా ఆయన అడుగులు సాగుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అయన ప్రతి చర్య ఒక మని తునక.

 

ఇక మూడవ  అభ్యర్థిగా ఎన్నికైన మంత్రి మోపిదేవి వెంకటరమణ వరద సహాయక చర్యల పర్యవేక్షణలో ఉన్నందువల్ల రాలేకపోయారని, ఆయన సహాయకులు రిటర్నింగ్ అధికారికి తెలిపారు. ఈ 3 స్థానాలకూ తెదేపా నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో.. వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.

 

తన రాజకీయ సువిశాల జీవితంలో రెండు అద్భుతాలు చూశానని చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. 2008-౦౯ లో వైఎస్ హయాంలో కృష్ణా, గోదావరి పొంగి జలాశయాలు నిండినపుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కాగానే మళ్లీ కృష్ణా, గోదావరి పొంగి జలాశయాలు నిండుతున్న తరుణంలో ఎమ్మెల్సీగా ఉన్నానని, దీనికి ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

 

ఇంకొకటి రాజకీయ అద్భుతమని, 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో టి.డి.పి ది దీనగాథ అయితే, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో వైకాపాది వీరగాథ అయిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఇక్బాల్ చెప్పారు. ఇకనుండి మనసా, వాచా, కర్మణా తన కర్తవ్యమ్ చేసేందుకు శతవిధాలా తనవంతు ప్రయత్నిస్తానని ఉద్గాటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: