ఇండియా.. పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో.. అగ్రరాజ్యం మొట్టికాయలు వేసింది.  దూకుడు తగ్గించాలని చెప్పింది.  ఇది జరిగిన వెంటనే ఇండియాతో వాణిజ్య సంబంధాలను తెంచేసుకుంది పాక్.  దాని వలన భారత్ కు వచ్చిన ముప్పులేదన్న సంగతి ఆ దేశానికీ తెలుసు.  ఏదోవిధంగా తన నిరసనను తెలియజేయాలి కాబట్టి ఇలా చేసింది.  అనంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టి బోర్డర్ లో కాల్పులకు తెగబడింది. 


అక్కడితో ఆగకుండా భారత్ ను అడ్డుకోవాలంటే జీహాదీ తరహా ఉద్యమం ఒక్కటే మార్గం అని స్వయానా ఆ దేశాధ్యక్షుడు చెప్పాడు అంటే..పాక్ ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. పాకిస్తాన్ తన కంప్లైంట్ బాక్స్ ను తీసుకొని తిరుగుతూనే ఉన్నది.  భద్రతా మండలిలో చైనా ద్వారా ఫిర్యాదు చేయించింది.  అత్యవసర సమావేసం ఏర్పాటు చేయించింది.  ఫలితం శూన్యం.  అన్ని దేశాలు భారత్ కు సపోర్ట్ చేశాయి.  అయినా తన దారి మార్చుకోలేదు.  


ఆర్టికల్ 370 రద్దు వలన ఆఫ్గనిస్తాన్ లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.  పాక్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరికి షాక్ ఇచ్చాయి.  భారత్ లోని కాశ్మీర్ సమస్యకు.. ఆఫ్గనిస్తాన్ కు సంబంధం ఏంటో అర్ధం కాలేదు.  ఆఫ్గనిస్తాన్ లోని ఉగ్రవాదం పాకిస్తాన్ నుంచి వస్తున్నదే.  అంటే .. కాశ్మీర్ సమస్యను సాకుగా చూపించి.. ఆఫ్గనిస్తాన్ లో మారణకాండకు తెగబడతారా.. బహుశా అర్ధం ఇదే కావొచ్చు. 
ఇండియా అణ్వస్త్ర విధానం భయపెట్టే విధంగా ఉందని, తమకు ముప్పు కలిగించే విధంగా ఉందని చెప్పి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేసి చెప్పారు.  అయన దీనిని పెద్దగా పట్టించుకోలేదు.  ఆ తరువాత రెండు రోజులకు భారత ప్రధాని ట్రంప్ కు ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  పాక్ ప్రధాని పేరు చెప్పకుండా అనేక విషయాల గురించి మోడీ మాట్లాడారు.  దాదాపు అరగంట పాటు వీరి మధ్య చర్చ జరిగింది.  


ఈ చర్చలో అనేక విషయాలు మాట్లాడారు.  దీంతో పాకిస్తాన్ షాక్ అయ్యింది.  అరగంట పాటు ఫోన్ లో మాట్లాడటంతో ఇటు పాక్ తో పాటు అటు మిత్రదేశం చైనాకూడా కలవరపెడుతుంది.  ఇప్పటికే అమెరికాకు, చైనాకు మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్నది.  ఇండియా.. అమెరికా మైత్రి బలపడుతుండటంతో.. చైనాకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నాయి.  పాక్ కు సపోర్ట్ చేయడం వలన ఇండియాను ఎదగకుండా చేయాలి అనుకున్న చైనాకు భంగపాటు తప్పడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: