జగన్ అధికారంలోకి వచ్చి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతి తక్కువ టైంలోనే జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. గత ప్రభుత్వం తీసుకోని ఎన్నో నిర్ణయాలు జగన్ వేగంగా తీసుకుంటూ పరిపాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ అధికార పార్టీ అయినా ఇలానే పని చేస్తే ప్రతి పక్ష పార్టీ మనుగడ కష్టమని చెప్పాలి. ఇప్పుడు ప్రతి పక్షంలో ఉన్న టీడీపీ పార్టీ పరిస్థితి వేరే చెప్పాల్సిన పని లేదు. 60 లేదా 70 సీట్లు గెలిచి ఉంటే సరే అనుకోవచ్చు .. కానీ టీడీపీది ఘోర పరాజయం. పైగా ఇప్పుడు జగన్ సెరవేగంగా దూసుకు పోతున్నారు. ఇదే మాదిరిగా జగన్ పరిపాలన చివరి వరకు ఉంటే, జనాలు మళ్ళీ జగన్ కే  పట్టం కడుతారు. ఇక చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమని చెప్పాల్సిందే. 


జగన్ తక్కువ టైం లోనే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు. చాలా కీలక బిల్లులు అయిన ఉదాహరణకు వెనుకబడిన తరగతులకు నామినేటెడ్ పదవులకు 50 శాతం రిజర్వేషన్స్ అయితేనేం, అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కీలక సంస్కరణల కోసం కొత్త చట్టాన్ని తీసుకురావటం.. ఇవన్నీ పేద ప్రజలకు మేలు చేసేవి. 


అలాగే దేశంలో ఏ రాష్ట్రం భర్తీ చేయని విధంగా ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తున్నారు. లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి సుమారు 2 లక్షల 67 వేల ఉద్యోగాలు గ్రామీణ యువతకు అవకాశాలు కల్పించారు. ఇవే గాక ప్రభుత్వ ఉద్యోగాలు అయిన గ్రామ సచివాలయాలు సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు వదిలి ఔరా అనిపించారు. తన మ్యానిఫెస్టో లో చెప్పిన విధంగా జాబులకు నోటిఫికేషన్ ఇచ్చి త్వర త్వరగా రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: