చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన భారీ అవినీతిని బయటకు తీయటం, రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించటమనే లక్ష్యంతో జగన్ ముందుకు పోతున్నారు. అయితే ఇక్కడే ఇటు బిజెపికి అటు చంద్రబాబునాయుడుకు మండింది. కేంద్రం పాయింట్ లో చూస్తే పైకి జగన్ విధానం వల్ల ప్రాజెక్టు పనులు లేటవుతాయని, ఖర్చు మరింతగా పెరుగుతుందని చెబుతోంది.

 

అదే సమయంలో జగన్ తన టార్గెట్ ప్రకారం ముందుకుపోతే జరిగిన అవినీతి బయటపడుతుందన్నది చంద్రబాబు భయం. దాంతో పోలవరం విషయంలో జగన్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు తెరవెనుక బిజెపి, చంద్రబాబు ఏకమయ్యారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

ఎలాగంటే చంద్రబాబు హయాంలో మొదటి నాలుగేళ్ళు టిడిపి+బిజెపి కలిసే ఉన్నాయి. కాబట్టి అప్పట్లో పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి రెండుపార్టీలు బాధ్యత వహించాల్సిందే.  చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎంలాగ వాడుకుంటున్నారని స్వయంగా నరేంద్రమోడి ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

ఇపుడు జగన్ గనుక ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించినా, రివర్స్ టెండరింగ్ లో ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించగలిగినా చంద్రబాబు అవినీతి బయటపడటం ఖాయం. పనిలో పనిగా కేంద్రంలోని పెద్దల బండారం కూడా బయటపడుతుంది. అందుకే జగన్ నిర్ణయాన్ని మొదటినుండి కేంద్రం, చంద్రబాబు వ్యతిరేకిస్తోంది. అయితే వీళ్ళ వ్యతిరేకతను జగన్ ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకు పోతున్నారు. దాంతో జగన్ ను నేరుగా ఏమి చేయలేకే చివరకు నవయుగ కంపెనీని రంగంలోకి దింపినట్లు అర్ధమవుతోంది.

 

దానికితోడు ప్రభుత్వం కూడా ప్రాజెక్టు పనుల నుండి ఏకపక్షంగా తొలగించటం నవయుగ కంపెనీ యాజమాన్యానికి అందివచ్చింది. దాంతో వెంటనే ప్రభుత్వ నిర్ణయంపై కేసు వేసింది. అంటే కేసు వేసింది నవయుగ కంపెనీనే అయినా వేయించింది మాత్రం చంద్రబాబు, బిజెపినే అనే ప్రచారం మొదలైంది. చూడబోతే పోలవరమే మళ్ళీ బిజెపి, చంద్రబాబును కలుపుతుందేమో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: