ఇప్పుడెలావుందంటే..తెలంగాణ గవర్నర్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న తన తల్లి పిండ ప్రధాన కార్యక్రమం కోసం ఆయన సతీమణి విమలా నరసింహన్ తో బీహార్ లోని గయ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే పిండ ప్రధాన కార్యక్రమంలో భాగంగా ఆయన ఒకరోజు కఠిన ఉపవాసం ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అకస్మాత్తుగా వాంతులు చేసుకున్నారు. దీంతో.. అధికారులు వెంటనే ఆయనను మగథ్ హెల్త్ కాలేజీ ఎమర్జెన్సీ వార్డు కు తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఎటువంటి సమస్య లేదని తెలిపారు :


బీపీ, పల్స్ నార్మల్ గా ఉండటంతో ఆయన వ్యక్తిగత డాక్టర్ ను సంప్రదించి డిశ్చార్జ్ చేసినట్టు ఆసుపత్రి సూపెరింటెండెంట్ తెలిపారు. అనంతరం గవర్నర్ దంపతులిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు.ఇదిలావుంటే.. నేడు గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశం కానున్నారు. త్వరలో కేంద్రం నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల గవర్నర్ ల సమావేశం నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. దేశంలోనే అత్యంత సీనియర్ గవర్నర్ అయిన నరసింహాన్ సలహాలు తీసుకునేందుకు కేంద్రం అతనిని ఈ భేటీకి ఆహ్వానించింది. ఈ భేటీలో వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.ఇకపోతే :


తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నరసింహాన్ తదనంతరం రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ కు బిశ్వభూషణ్ హరిచంద్ గవర్నర్ గా రావడంతో నరసింహన్ ఎప్పుడు తెలంగాణకు గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గవర్నర్ గా కొనసాగడం.. పదవికాలం కూడా పూర్తి కావడంతో రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకంపై వార్తలు వస్తున్నాయి  : :   

మరింత సమాచారం తెలుసుకోండి: