ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాలు మధ్యప్రదేశ్ ని  వణికిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుంది. భోపాల్ లో వర్ష ఉదృత వల్ల చాలా మంది వరదలో చిక్కుకున్నారు. వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్ కాపాడింది. వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చింది . అయితే భోపాల్ వరదలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. వరద ఉప్పొంగుతుండటంతో బయట పడే మార్గం లేకపోయింది . దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ ముగ్గురిని వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ వరదలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేసింది .



ఎంతో సాహసోపేతంగా వ్యవహరించి నిచ్చెన ద్వారా సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి వారిని రెస్క్యూ టీం బయటపడేశారు . భోపాల్ లో వరదల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల్ని రెస్క్యూ టీమ్ అతి కష్టం మీద క్షేమంగా వారిని బయటకు తీసుకురాగలిగారు . ఒక నిచ్చెన సాయంతో ఒక వంతెన నుంచి మరొక వంతెన వైపుగా వరదలో చిక్కుకున్న ముగ్గురిని కూడా రెస్క్యూ టీమ్ చేర వేశారు . ఇటీవల వరదల్లో చిక్కుకున్న ఎంతో మందిని ఆర్మీ , ఎన్డీఆర్ ఎఫ్ , రెస్క్యూ టీమ్స్ ఎంతో సాహసోపేతంగా వారందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు .


అలాగే భోపాల్ లో వరదల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల్ని కూడా రెస్క్యూ టీమ్ ఇదే విధంగా రక్షించారు . ఒక జలపాతం దగ్గర చిక్కుకు పోయిన ముగ్గురుని క్షేమంగా బయటకు తీసుకురాగలిగింది రెస్క్యూ టీం. అతిగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే భారీగా నష్టం వాటిల్లుతుంది. భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. దీనిపై ప్రభుత్వాలు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: