సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అడ్డంగా దొరికిపోయారు. ఫర్నీచర్ తరలింపు విషయం కోడెల  కక్కుర్తి బయటపడింది. ఫర్నీచర్ మాయం కేసులో అరెస్టు తప్పదని తేలిపోయిన తర్వాత ఫర్నీచర్ తన దగ్గరే ఉందని అంగీకరిస్తూనే బుకాయింపులకు దిగారు.


విషయం ఏమిటంటే 2017లో అసెంబ్లీ హైదరాబాద్ నుండి అమరావతికి తరలినపుడు లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ మాయమైపోయింది. మాయమైన ఫర్నీచర్ కోసం అధికారులు ఎంత వెతికినా కనబడలేదు. చివరకు ఆ ఫర్నీచర్ కోడెల దగ్గరే ఉందని అర్ధమైపోయింది. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పటికీ ఫర్నీచర్ గురించి అధికారులు ప్రస్తావించినా కోడెల ఏమీ సమాధానం చెప్పకపోవటంతో తర్వాత ఎవరూ మాట్లాడలేదు.

 

సీన్ కట్ చేస్తే టిడిపి అధికారంలో ఓడిపోయి వైసిపి అధికారంలోకి రాగానే మాయమౌన ఫర్నీచర్ వ్యవహారం మళ్ళీ ప్రాణం పోసుకుంది. నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు అందిన ఫిర్యాదుపై విచారణ చేయమని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పోలీసులను ఆదేశించారు. పోలీసుల విచారణ మొదలవ్వగానే కోడెలకు సీన్ అర్ధమైపోయింది.

 

వెంటనే ఫర్నీచర్ తన దగ్గరే ఉందంటూ మీడియా సమావేశంలో  కమిట్ అయ్యారు. అసెంబ్లీలో ఫర్నీచర్ కు భద్రత లేదన్న కారణంతోనే తన ఇంట్లో, క్యాంపు కార్యాలయంలో పెట్టుకున్నట్లు బుకాయిస్తున్నారు. ఫర్నీచర్ ను పంపమన్నా పంపేస్తారట లేకపోతే దాని విలువ చెల్లించమన్నా చెల్లించేస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. అంటే అరెస్టు తప్పదని తేలిపోయిన తర్వాతే కోడెల కొత్త నాటకాలు మొదలుపెట్టారు.

 

అయినా దశాబ్దాల పాటు అధికారం అనుభవించిన కోడెల కూడా ఫర్నీచర్ కోసం ఇంత కక్కుర్తిపడటం ఏమిటని టిడిపి నేతలే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా బయటపడిన కోడెల కక్కుర్తిపై చంద్రబాబానాయుడు, పచ్చ తమ్ముళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే. 24 గంటలూ ఎదుటివాళ్ళపై బురదను వేయటమే అలవాటైన చంద్రబాబు అండ్ కో ఇపుడు తమ పార్టీ మీద పడిన బురదకు ఏమని సమాధానం చెబుతారో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: