అక్బరుద్దీన్ ఈ పేరు వినగానే ఉద్వేగ ప్రసంగాలు చేసే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తుకొస్తారు. కానీ ఇది ఆగస్టు పదహారుకు ముందు ఇప్పుడు అక్బరుద్దీన్ అనగానే ఓవైసీతో పాటు ఇంకొకరు గుర్తొస్తారు ఆయనే సయ్యద్ అక్బరుద్దీన్. ఐక్యరాజ్య సమితిలో భారత అధికార ప్రతినిధి ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణపై భారతవాణిని ఐక్యరాజ్య సమితిలో సమర్థంగా వినిపించడమే కాదు తన ప్రసంగంతో భారతకు అంతర్జాతీయ సమాజం మద్దతును సాధించిపెట్టారు. భారత్ ను ప్రపంచ దేశాల్లో ఏకాకిగా చేయాలన్న పాకిస్థాన్ చైనాకు యుక్తిని తిప్పికొట్టి ఆ దేశాలే తలదించుకునేలా చేసిన సయ్యద్ అక్బరుద్దీన్ అసలు సిసలైన హైదరాబాదీ.ఆయన వాక్ చాతుర్యమే సయ్యద్ అక్బరుద్దీన్ ని భారత్ లో హీరోగా నిలిపింది. కాశ్మీర్ అంశం భారత్ ఆంతరంగిక వ్యవహారమని ప్రపంచం నమ్మేలా చేసింది.



నలభై ఎనిమిదేళ్ల తర్వాత కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించేలా చేశామంటూ సంబరపడిపోయిన పాకిస్థాన్ , చైనా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అందుకు కారణం అక్బరుద్దీన్ దౌత్యమే కశ్మీర్ పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ తర్వాత మీడియా సమావేశం జరిగింది. ఇందులో పాక్ చైనా అధికార ప్రతి నిధులు మాట్లాడిన తరువాత భారత్ తరుపున మీడియా ముందుకొచ్చారు సయ్యద్ అక్బరుద్దీన్. ఇందులోనే కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఏంటో కుండ బద్ధలు కొట్టారు అక్బరుద్దీన్. పాక్ తో శాంతి చర్చలు ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారనే పాక్ జర్నలిస్టులు ప్రశ్నిస్తే ముందు మీతో కరచాలనం చెయ్యనివ్వండి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి సమయస్ఫూర్తిని ప్రదర్శించారు.


ఇక ఆ తరువాత ఇండియా విధానాన్ని అంతర్జాతీయ మీడియా ముందు స్పష్టంగా సూటిగా వివరించారు. మొత్తం సమావేశల్లో సయ్యద్ అక్బరుద్దీన్ కూడా సహనం కోల్పోలేదు. విలేఖరులతో సరదాగా మాట్లాడుతూనే తను చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్పేశారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ కు తిరుగులేని విజయం సాధించిపెట్టిన అక్బరుద్దీన్ ఎవరో తెలుసా పక్కా హైదరాబాదీ. అయన పుట్టి పెరిగింది చదువుకుంది అంత భాగ్యనగరంలోనే అక్బరుద్దీన్ పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ లో హైదరాబాద్ లో పుట్టారు. ఆయన తండ్రి బషీరుద్దీన్ ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం చీఫ్ గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పని చేశారు. అంతేకాదు ఖతర్ లో భారత రాయబారిగా కూడా సేవలందించారు.


అక్బరుద్దీన్ తల్లి జెబా బషీరుద్దీన్ కోఠి మహిళా కళాశాలలో ఆ తర్వాత సత్యసాయి యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారు. అక్బరుద్దీన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ లో పీజీ చేసి పంతొమ్మిది వందలు ఎనభై ఐదులో ఐఎఫ్ ఎస్ గా ఎంపికయ్యారు. అక్బరుద్దీన్ కి అరబిక్ వృద్ధులపై కూడా గట్టి పట్టుంది. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషనర్ లు రాయబారిగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా విదేశాంగశాఖ అదనపు కార్యదర్శిగా కూడా పని చేశారు ఆయన.


రెండు వేల పదహారు జనవరి నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. అక్బరుద్దీన్ అనేక అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ కు విజయం సాధించిపెట్టారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ పై నిషేధం మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రపంచం గుర్తించడం వెనుక అక్బరుద్దీన్ కృషి అద్భుతమని దౌత్య వర్గాల ప్రశంసిస్తున్నాయి. అక్బరుద్దీన్ మాట సున్నితం అయినప్పటికీ వ్యవహార శైలి మాత్రం చాలా కఠినం అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న దౌత్య విజయాలే ఇందుకు నిదర్శనం.


మరింత సమాచారం తెలుసుకోండి: