2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కొత్తరాజధానిని ఏర్పాటు చేశారు.  దానికోసం అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేల ఎకరాల భూమిని సేకరించింది.  పెట్టుబడులను ఆకర్షించిందని.  సింగపూర్, జపాన్ వంటి దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి.  కొన్ని నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.  అయితే, అయిదేళ్లలో పూర్తి చేయాలి అనుకున్న నిర్మాణాలు పూర్తికాలేదు.  



2019 లో ఎన్నికలు వచ్చి బాబు ఓడిపోయాడు.  అమరావతి మాట పక్కన పడింది.  అమరావతిపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పెద్దగా శ్రద్ద పెట్టడంలేదు అన్నది వాస్తవం.  రాజధానిని ఎప్పుడైనా నిర్మించుకోవచ్చు అన్నది వైకాపా వాదన.  అందుకోసం ఇప్పుడు నిధులు ఖర్చు చేయడం వృధా అన్నది వైకాపా ప్రభుత్వం వాదన.  పైగా అమరావతి కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నది.  వరదలు వంటివి వచ్చినపుడు రాజధాని ప్రాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  



మునిగిపోయే దానిపై ఎందుకు నిధులు కేటాయించాలనే దిశగా ఆలోచిస్తున్నది ప్రభుత్వం. పైగా ప్రభుత్వం ఇప్పుడు నవరత్నాలు హామీ ఇచ్చింది.  వాటిని నెరవేర్చాలి అంటే డబ్బు కావాలి.  వాటి కోసం నిధులను సేకరిస్తోంది.  ఈ సమయంలో అమరావతికి డబ్బులు అంటే కష్టమే మరి.  అంతేకాదు, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు.  



నిన్నటి వరకు నీళ్ల గురించి ఇబ్బందులు పడ్డారు.  ఇబ్బందుల తరువాత ఇప్పుడు జోరుగా వానలు కురుస్తున్నాయి.  జలాశయాలు నిండిపోయాయి.  వాటిని ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.  నవరత్నాలు హామీని నెరవేర్చిడంలో సక్సెస్ అయితే.. తప్పకుండా నెక్స్ట్ తిరిగి అదే పార్టీ అధికారంలోకి వస్తుంది.  అప్పుడేమైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.  పైగా అమరావతి నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతుందని బొత్స చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అర్ధం అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: