ప్రోజెక్టుల విషయంలో అవినీతి జరిగిందని.. అనుకున్న వ్యయం కంటే వేలాది కోట్ల రూపాయల వ్యయం చేసి ప్రాజెక్టులు నిర్మించారణై అవినీతి విచారణ జరిపిస్తామని బీజేపీ నేత, కేంద్ర మంత్రి జెపి నడ్డా పేర్కొన్న సంగతి తెలిసిందే.  తెలంగాణా పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  బీజేపీని తెలంగాణాలో బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నది పార్టీ.  ఇందులో భాగంగా కేంద్ర నేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చి మంతనాలు జరుపుతున్నారు.  


జెపి నడ్డా చేసిన వ్యాఖ్యలపై తెరాస పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.  నడ్డా ఎవరో తనకు తెలియదని, అయన చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని పేర్కొన్నారు.  ఆరోపణలు చేయడం కాదు.. వాటిని నిరూపించాలని  కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో తెలంగాణాలో తెరాస.. బీజేపీల మధ్య వార్ షురూ అయ్యింది.  ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.  


జెపి నడ్డా చేసిన వ్యాఖ్యలకు అనుకూలంగా విజయశాంతి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  గతంలో ఇంటర్మీడియట్ రిజల్ట్ లో అవకతవకలకు గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యమే కారణమని.. ఆ సంస్థకు పెద్దలతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు గతంలో ఆరోపించినప్పుడు కూడా కేటీఆర్‌ ఇదే విధంగా సవాల్‌ విసిరారని అన్నారు.  ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని విజయశాంతి చురకలు అంటించారు.  


జెపి నడ్డాకు అనుగుకూలంగా విజయశాంతి మాట్లాడటంతో తెలంగాణాలో గుసగుసలు మొదలయ్యాయి.  రాములమ్మ తిరిగి బీజేపీలో జాయిన్ కాబోతున్నదని అందుకే ఇలా వారికి అనుకూలంగా మాట్లాడుతుందని అంటున్నారు.  వీటిని ఆమె పట్టించుకోవడం లేదు.  ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే తన లక్ష్యం అని అంటోంది రాములమ్మా.  మరి రాములమ్మ చేసిన ఈ వ్యాఖ్యలపై తెరాస పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఒకవేళ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ప్రోజెక్టుల విషయంలో అవినీతి జరిగి ఉంటె.. అది నిజమే అని నిరూపణ జరిగితే.. నెక్స్ట్ ఏంటి..?


మరింత సమాచారం తెలుసుకోండి: