కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం చంద్ర‌బాబు స‌ర్కార్‌తో చివ‌రి రెండేళ్లు ఘ‌ర్ష‌నాత్మ‌క వాతావ‌ర‌ణాన్నే అవ‌లంభించింది. ఇప్పుడు ప్ర‌భుత్వం మారి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సీఎం అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి సాయం చేసే విష‌యంలో బీజేపీ అంత సానుకూలంగా ఉన్న‌ట్టు అనిపించ‌లేదు. దీనికి తోడు ఏపీ బీజేపీ నేత‌లు కూడా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ జ‌గ‌న్‌తో స్నేహానికి రెడీగానే ఉన్న‌ట్టు సంకేతాలు పంప‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. 


సౌత్‌లో బీజేపీకి కేసీఆర్‌తో ఎలాగూ ఫైట్ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో గెల‌వ‌డ‌మే టార్గెట్‌గా బీజేపీ నేత‌లు ప‌ని చేస్తున్నారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా టార్గెట్‌గా చేసుకుని ప‌ని చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో అత్తెస‌రు మెజార్టీతో అధికారంలో ఉంది. కేర‌ళ‌, త‌మిళ‌నాడులో ఆ పార్టీకి సీన్ లేదు. ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఘ‌ర్ష‌నాత్మ‌క ధోర‌ణి కంటే స్నేహ‌పూర్వ‌క ధోర‌ణితోనే ముందుకు వెళితే భ‌విష్య‌త్తులో క‌లిసి వ‌స్తుంద‌న్న ప్లాన్‌తోనే బీజేపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. 


తాజాగా జ‌గ‌న్‌కు కేంద్రం ఓ కీల‌క ప‌ద‌వి ఇచ్చింది. ఆయ‌న్ను అంతర్ రాష్ట్రాల మండలి స్థాయీ సంఘం సభ్యునిగా నియమించింది. అంత‌రాష్ట్రాల మండ‌లి వివిధ రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తే వివాదాల‌ను ద‌ర్యాప్తు చేసి వాటికి త‌గిన ప‌రిష్కార మార్గాల‌ను సూచిస్తుంది. దేశం మొత్తం మీద బీజేపీయేత‌ర ముఖ్యమంత్రుల్లో కేవ‌లం న‌లుగురికి మాత్ర‌మే ఈ చోటు ద‌క్కింది. వీరిలో త‌ట‌స్థంగా ఉండే వారిలో న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తో పాటు జ‌గ‌న్ మాత్ర‌మే.


ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు బీజేపీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డం వెన‌క కూడా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తెలంగాణ‌లో బీజేపీ టార్గెట్ మామూలుగా లేదు. టీఆర్ఎస్ ఎంపీల‌తో పాటు పెద్ద త‌ల‌కాయ‌ల‌ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలో కేసీఆర్‌కు రాజ‌కీయంగా ప్ర‌యార్టీ ఇచ్చేందుకు ఆ పార్టీ ఇష్ట‌ప‌డ‌డం లేదు.


భ‌విష్య‌త్తులో ఏపీతో పాటు జాతీయ రాజ‌కీయాలు, ఇటు ద‌క్షిణాది అవ‌స‌రాల నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌కు ఈ కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన‌ట్టు తెలుస్తోంది. భ‌విష్య‌త్తు అవ‌స‌రాన్ని బ‌ట్టి ఏపీలో జ‌గ‌న్‌తో బీజేపీ పొత్తు ఉండే ఛాన్స్ కూడా ఉంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా.


మరింత సమాచారం తెలుసుకోండి: