భారత్ పాక్  మధ్య తలెతుతున్న వివాదలపై అమెరికా అధ్యక్షుడి సైతం స్పందించారు.భారత్ పాక్ మధ్య తలెత్తిన అనిశ్చితి పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరా తీస్తున్నారు. ఇటీవలే భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్ చేసి మాట్లాడారు. ఆయన రెండు దేశాలు ఉద్రిక్తలు తగ్గించుకోవాలన్నారు. అయితే పాక్ చేస్తున్న దారుణాలను కళ్లకు కట్టినట్లు వివరించారు మోదీ.మోదీ కి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు.

పాక్ బండారాన్ని బయటపెట్టారు మన  ప్రథాని. పాక్ పన్నుతున్న కుట్రల గురించి ట్రంప్ కి వివరించారు మోదీ.భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎన్నో మాటలంటోంది. అంతర్జాతీయంగా తన పై సానుభూతి రావాలని నోటికొచ్చిన కారుకూతలు కూస్తుంది. కాశ్మీర్ అంశం కేంద్రంగా ముసలి కన్నీరు కారుస్తూ తన పై సానుభూతి కలిగేలా ప్రవర్తిస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్ము కాశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక వీరిరువురి మధ్య చర్చలు జరగడం ఇదే మొదటి సారి. ట్రంప్ తో ఫోన్ కాల్లో మోదీ అన్ని వివరాలనూ ప్రస్తావించారు. పాక్ తీరును తీవ్ర స్థాయిలో ఖండించారు. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికి ఉగ్ర విధ్వంసాలు జరగకుండా చూడాల్సిన వాతావరణాన్ని నెలకొల్పే ఆవశ్యకతను మోదీ ప్రస్తావించారు. పేదరికం నిరక్షరాస్యత వ్యాదులపై భారత్ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు.

అఫ్గనిస్తాన్ వందవ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గుర్తు చేస్తూ ఆ దేశ భద్రతకు ప్రజాస్వామ్యానికి స్వతంత్రతకు కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. జూన్ లో ఒసాకాలో జరిగిన జీ 20 సదస్సులో ట్రంప్ తో సాగించిన చర్చలను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై రెండు దేశాల మధ్య త్వరలోనే అత్యున్నత స్థాయిలో చర్చలు జరగాలని కోరుకున్నారు.

దాదాపు అరగంట పాటు ఈ ఫోన్ సంభాషణ జరిగినట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా అనేక ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలు చర్చకు వచ్చాయని పిఎంఓ తెలిపింది. రెండు రోజుల క్రితం ట్రంప్ ఇమ్రాన్ కు ఫోన్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మోదీతో అమెరికా అధ్యక్షుడు సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది.కాశ్మీర్ అంశాన్ని భారత్ తో కలిసి ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధానికి ట్రంప్ సూచించారు.

ఈ సందర్భంగా భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మోదీతో ట్రంప్ చర్చించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని ఈ ప్రాంతంలో శాంతి వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించినట్లు వివరించింది. వాణిజ్యాన్ని పెంచుకోవడం ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని బలోపితం చేసుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. ట్రంప్ మోదీ చర్చలు ఏ మాత్రం పాక్ భారత్ చర్చలపై ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: