రాజధాని నిర్మాణం పై ఈ రోజు విశాఖపట్నంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ లోనూ అదే విధంగా ఏపీ రాజధాని లోనూ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వరద నీటిని తోడి పోయాల్సి వస్తుందని అదే విధంగా పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని చెప్పి ప్రకాశం బ్యారేజి దగ్గర వరద ఎక్కువగా వస్తే రాజధానిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా నీట మునిగిపోతాయని, రాజధానిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. పైగా దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. దీని మీద చర్చలు కూడా జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాజధానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాజధానిలో కొండవీటి వాగు, ముంపుకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఒకటి ఇప్పటికే ఏర్పాటు చేశారు.


కొండవీటి వాగు ముంపు ఒకటి మాత్రమే రాజధానికి ముంపు పొంచి ఉందని చెప్పి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు కొండవీటి వాగు ముంపు భూములకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని ప్రకాశం బ్యారేజీలోకి తోడి పోసేందుకు నిర్ణయించగా ప్రస్తుతం ఒక ఎత్తిపోతల పథకం అమలులో ఉంది. అయితే ఈ ఎత్తిపోతల కొండవీటి వాగు ముంపు వస్తేనే రాజధానిలోని నీరు కొండ , ఎర్రబాలెం ప్రాంతమంతా కూడా  మునిగిపోతుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . అయితే దీనిపైనే ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి నిర్మాణం పూర్తయిన తరువాతనే రాజధాని నిర్మాణానికి ఎన్జిటి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.ఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో రాజధానికి సంబంధించిన కొంత మంది రైతులతో పాటు పర్యావరణ వేత్తలు కూడా పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో రాజధానికి వరద ముంపు ముంచి ఉందని అదే విధంగా సంవత్సరానికి మూడు రకాల పంటలు పండే భూములని నిరుపయోగంగా మారుస్తున్నారని, రాజధాని నిర్మాణం చేస్తున్నారని చెప్పి కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరగటమే కాకుండా ఎన్జీటీ లో కూడా పిటిషన్ ఫైల్ చేశారు.


ఈ అంశంపై రాజధానికి సంబంధించి అప్పట్లో వాదోపవాదాలు జరిగాయి. చివరికి రాజధాని నిర్మాణానికి సంబంధించి  ఎన్జీటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పట్లో ఎన్జీటీ కొండవీటి వాగు ముంపు పథకాన్ని వెంటనే చేపట్టాలి అని చెప్పి ఆదేశించింది. ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా పూర్తి చేసింది. ఇటీవల కాలంలో వచ్చిన వరదల కారణంగా రాజధానికి సంబంధించి ముఖ్యంగా రాజధానిలో ఉండే లంకభూములు, కృష్ణానదీ గర్భంలో ఏవైతే లంక భూములు ఉన్నాయో అవి  మునిగాయి కానీ, ఎక్కడా కూడా రాజధానిలో ఉన్న గ్రామాలకూ ఎటువంటి నీరు చేరలేదు.ఒక్క రాయపూడిలో పాలవాగుకు సంబంధించిన గేట్లు క్లోజ్ చేయకపోవటం ఆ వరద రాయపూడి ప్రాంతంలో లోపలకి వచ్చింది. అంతేకానీ ఇంకెక్కడా కూడా రాజధాని గ్రామాల్లో నీట మునగ లేదు అయితే ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన అంటే ఉండవల్లి గ్రామ పరిధిలో ఉన్న ముప్పై రెండు కట్టడాలలోకి నీళ్ళు వచ్చాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది.


ఈ  మేరకు అక్కడ ఉన్నవాళ్ళను కూడా ఖాళీ చెయ్యాలని నోటీసులు జారీ చేశారు. పైగా ఈ నిర్మాణాలన్నీ కూడా అక్రమం అని ఇప్పటికే పిఆర్ జిఎ నోటీసులు ఇచ్చి వాటిని కూలగొడతామని కూడా పేర్కొంది. అయితే తమకు ఉండవల్లి గ్రామ పంచాయతీ పరిధి ఉన్నప్పుడు గ్రామపంచాయతీ అనుమతినిచ్చిందని చెప్పి ఆ నిర్మాణాలకి యజమానులంతా కూడా హై కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం హై కోర్టులో వివాదం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు గా ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఏడు ఎకరాలు రైతుల భూ సమీకరణ విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సిఆర్ డిఎకి ఇచ్చారు. వాటికి సంబంధించి చాలా ప్లాట్ లు కూడా రిజిస్ర్టేషన్ అయ్యాయి రిటర్నబుల్ ప్లాట్స్. ఈ నేపథ్యంలో రాజధాని అక్కడి నుంచి తరలించాలన్నా లేకపోతే రాజధానిపై పునరాలోచన చేయాలన్నా కూడా అక్కడికే ఇప్పటికే కొన్ని బిల్డింగులు కూడా పూర్తయ్యాయి. పైగా రాజధానిలో సుమారు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలతో రాజధానిలో మౌలిక సదుపాయాలు రహదారులు గాని, భవనాల గానీ వీటన్నింటికి సంబంధించి కూడా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వీటిలో అవకతవకలు జరిగాయని దీని మీద పునరాలోచన చేసుకుందామని,  దీని పై రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రకటించడం పై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చాలని చెప్పి తీసుకునే నిర్ణయం ఎంత వరకు జరుగుతుంది ఏమిటి అనేది వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: