పాలనాపరంగా దూకుడుగా ఉండడంతో పాటు రాజకీయంగా సంస్కరణల పధంలో పయనించేందుకు జగన్ ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. ఓ వైపు సామాజిక న్యాయం చేస్తూనే మరో వైపు పార్టీలో జూనియర్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేపధ్యంలో సీనియర్లను సైతం జగన్ వదులుకోదలచుకోలేదు.


అందుకే తన క్యాబినేట్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకి  2023 వరకూ ఉండే ఎమ్మెల్సీ స్థానం కల్పించారు. అంటే జగన్ మంత్రివర్గం రెండున్నరేళ్ల తరువాత కూడా కొనసాగే మంత్రిగా మోపిదేవి ఉంటారని గట్టి సంకేతాలు ఇచ్చారన్నమాట. మోపిదేవి జగన్ కి కష్తకాలంలో అండగా ఉన్నారు. అందువల్ల ఆయన మీద ప్రత్యేక అభిమానంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.


ఇక జగన్ క్యాబినేట్లో ఇంకా మరికొందరు సీనియర్లు ఉన్నారు. వారిలో రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పంచాయతిరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మునిసిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, విధ్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వీరందరికీ జగన్ మంత్రివర్గంలో ఫుల్ టెర్మ్ ప్రాతినిధ్యం ఉండే అవకాశాలు ఉన్నాయని జగన్ తాజా డెసిషన్ తో అర్ధమవుతోంది అంటే రెండున్నరేళ్ళ తరువాత మార్చే మంత్రులు ఇరవై మంది వరకూ ఉంటారన్నమాట.


వారిని తప్పించి జగన్ కొత్త వారిని ఎంపిక చేస్తారన్నమాట. ఓ విధంగా అప్పటికి అది ఎన్నికల టీం గా కూడా ఉంటుంది. ఇక ఇక్కడో వెసులుబాటు కూడా కొత్తవారికి, జూనియర్లకు జగన్ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పనితీరు బాగా కనబరిస్తే జూనియర్లు అయినా జగన్ మంత్రివర్గంలో పూర్తి కాలం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మరి చూడాలి ఎంత మంది కొత్త వారు ఫుల్ టెర్మ్ కొనసాగే చాన్స్ దక్కించుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: