ఇప్పుడు అమ్మాయిలుగాని, అబ్బాయిలుగాని అతి ముఖ్యంగా ఎదురుకుంటున్న సమస్య ముఖంపై నల్ల మచ్చలు మరియు తెల్ల మచ్చలు. ఇవి ముఖం మీద ఎక్కువగా కనిపిస్తాయి.అసలు ఇవి ఎలా వస్తాయి అంటే వాతావరణం లోని దుమ్ము దూళితో కలిసిపోయి అవి మన చర్మ రంద్రాల్లోకి చేరి నల్ల మచ్చలు మరియు తెల్ల మచ్చలు లాగా మారతాయి. ఇవి ముక్కు,బుగ్గలు,నుదిటిమీద్ద ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నివారించడానికి అనేక రకమైన ప్రొడెక్ట్స్ ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్నాయి. కాని వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి కొన్ని అధిక ధరలు కూడా,అందుకే వాటికి బదులుగా మన ఇంట్లోనే తయారు చేసుకోగలిగే అత్యంత సులభమైన మరియు  ప్రభావితమైన టిప్ ని తెలుసుకుందాం.

కావాల్సిన పధార్ధాలు:

టీ పొడి-కొద్దిగ,

పసుపు-చిట్టికెడు,

నిమ్మరసం-కొద్దిగ,

తయారు చేసుకునే విధానం:


ఒక చిన్న గిన్నెలో కొద్దిగ టీ పొడి తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి, దాంట్లో కొద్దిగ నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని నిమ్మ చెక్కకు అద్దుకుని దానిని ఎక్కడ అయితే నల్ల మచ్చలు మరియు తెల్ల మచ్చలు ఉంటాయో అక్కడ ఒక 5 నిమిషాలు పాటు మర్ధనా చేసుకోవాలి. ఇలా చేసే ముందు ముఖాన్ని గోరు వెచ్చటి నీటితో కడుగుకోవాలి. అది అప్లై చేశాక ఒక 5 నిమిషాలు ఉంచుకుని తరువాత చల్లని నీటీతో ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: