సీబీఐ అధికారులు చిదంబరం ఇంటికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు చిదంబరం. చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు చేరుకుని చిదంబరాన్ని కస్టడీకి తీసుకుంటారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చిదంబరం. అయితే ముందస్తు బెయిలు నిరాకరించింది కోర్టు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిక్కుల్లో పడ్డారు చిదంబరం. మనీలాండరిగ్ కు పాల్పడ్డట్టు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. మాజీ మంత్రి అయినా ఎవరైనా కోర్టు ముందు అందరూ సమానమే చెప్పి ఆయనకు బెయిల్ నిరాకరించింది కోర్టు.


ఢిల్లీ హైకోర్టులో చిదంబరంకు షాక్ తగిలింది. ఆయన బెయిలు నిరాకరించారు. ముందస్తు బెయిల్ పెట్టుకున్నారు. చిదంబరం కానీ కోర్టు ఆ బెయిలును నిరాకరించింది. ఐఎన్ఎక్స్ మీడియాలో ఆయన చిక్కుల్లో పడ్డారు. మనీలాండరిగ్ కు పాల్పడినట్టు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అయితే తాజాగా చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. మరి ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అన్న అంశంపై మాత్రం మరికాసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది.  చిదంబరాన్ని కస్టడీ కి కోరుతూ ఈడీ, సీబీఐ ముందే పిటిషన్ దాఖలు చేసింది. మరిప్పుడు చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు అంటే మరి ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.


ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరంకు ఢిల్లీ హై కోర్టు షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హై కోర్టు నిరాకరించింది, దాంతో ఈ కేసులో సీబీఐ ఈడీ అధికారులు ఏ క్షణంలో నైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తనకు మూడు రోజులు గడువు ఇవ్వాలని కోర్టును చిదంబరం కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది.


హైకోర్టు లో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టును ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఆశ్రయించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, ఇంద్రాణి ముఖర్జియా నుంచి ముడుపులు తీసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు చిదంబరం. ఎంపీ అయినంత మాత్రాన చిదంబరంకు ఎలాంటి మినహాయింపులు ఉండవని కూడా ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై ఈడీ తో పాటు సిబిఐ తరఫు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: