సికింద్రాబాద్ పోస్టాఫీస్ కు వచ్చిన యాభై కెమికల్స్ బాటిల్స్ కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రు లు అధికారుల పేర్ల తో వచ్చిన పార్సిల్ లో యాభై బాటిల్ గుర్తించారు పోస్టల్ సర్వీస్ అధికారులు. బాటిల్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉండొచ్చనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు అధికారులు. దీంతో బాటిల్స్ నుంచి శాంపిల్ స్ సేకరించి తనిఖీల కోసం ల్యాబ్ కు పంపారు పోలీసులు.

బాటిల్స్ వ్యవహారంపై రహస్యంగా విచారణ జరుపుతున్నారు అధికార సిబ్బంది. పోస్టల్ కార్యాలయాలున్న పార్సిల్ ఆఫీసులో ఒక సీల్డ్ కవర్లో మొత్తం యాభై బాటిల్స్ ని చూసిన అధికారులు వాటిని తెరవకుండా వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయగా అక్కడకు విచ్చేసిన పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా వాటిని తీసుకుని వెళ్లారు. వారు ఈ పార్సిల్స్ లో  ఏ రసాయనాలు ఉన్నాయో అవి పరీక్షించడానికి నిపుణుల వద్దకు తీసుకువెళ్ళారు.వారు పరీక్షలు జరిపిన తరువాత ఇవి నిజంగా విషపూరితమైన రసాయనాలా లేక ఎవరైనా ఆకతాయిగా పంపించారా అనే అంశం తెలియాల్సి ఉంది.ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రి మొదలు డీజీపీ, కింద అధికారులతో సహా ప్రతీ ఒక్కరికి బాటిల్స్ ను పంపించడంతో తీవ్ర అనుమానాలు వెల్లువడుతున్నాయి.


ప్రస్తుతం అధికారులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. ప్రతీ బాటిల్ ని పరీక్షించి అవి హానికరమైనవి ఐతే పంపిన వాళ్ళు ఏమి ఉద్దేశించి ఈ పని చేశారో అనే కోణంలో దర్యప్తు కొనసాగించనున్నారు అధికారులు.ఒకవేళ ఇవి ఆకతాయులు చేసిన పని ఐతే కనుక తక్షణమే వారి వివరాలను సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు పోలీసు అధికారులు.ల్యాబ్ అధికారులు ఇచ్చిన నివేదిక పై తదుపరి కార్యాచరణ జరగనుందని,వాటి కోసమే తాము వేచి ఉన్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: