ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా  అమరావతిని  కాకుండా మరొక ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు వైస్సార్  కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారా ? అంటే మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు పరిశీలిస్తే అవుననే సమాధానం విన్పిస్తోంది .  రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు .  మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి . బొత్స వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు . అమరావతి ముంపు ప్రాంతం గా చిత్రీకరించి రాజధానిని తరలించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


 అమరావతి పై మంత్రి బొత్స దారుణంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.  ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలు అర్థం చేసుకోవాలని అయన  కోరారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాల భూమి ని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారని , అన్ని మౌలిక వసతులు కేటాయించిన తరువాత మరో ఎనిమిది ఎకరాల భూమి ముగులుతుందన్న ఆయన , ఆ భూమిని అమ్మి పైసా ఖర్చు లేకుండా నిర్మించవచ్చునని చంద్రబాబు అన్నారు . అమరావతి నిర్మాణం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు . దాని వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న ఆయన, అమరావతి వరదల వల్ల ముంపుకు గురయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు .


 వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత అమరావతి నిర్మాణ పనులను నిలిపివేసిన విషయం తెల్సిందే . అమరావతి భూసేకరణ లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైస్సార్ కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు . ఇప్పుడు అమరావతి ని కాకుండా రాష్ట్ర రాజధానిగా మరొక ప్రాంతాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: