ప్ర‌ధాని న‌రేంద్రమోదీ స్కెచ్ ఫ‌లించింది. అన‌వ‌స‌రంగా క‌య్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్‌ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెక్ పెట్టేందుకు ఆయ‌న వేసిన ఎత్తుగ‌డ ఫ‌లితం ఇచ్చింది. ఆర్టిక‌ల్‌ 370 రద్దు చేసిన అనంత‌రం పాక్ కెలుక్కుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే, అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్ర‌ధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పాక్‌తో సంబంధాలు, జమ్మూకశ్మీర్ ప్రస్తుత పరిస్థితులు, సరిహద్దు ఉగ్రవాదం గురించి కూడా మోడీ చర్చించారు. అయితే, అనంత‌రం ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో వివాదాస్ప‌దంగా మారిన క‌శ్మీర్ అంశంపై అగ్ర‌రాజ్యాధినేత ట్రంప్‌ ఇద్ద‌రితోనూ చ‌ర్చించారు. ఈ విష‌యాన్ని ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 


అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడిన నరేంద్ర మోడీ... ఇమ్రాన్‌ రెచ్చగొట్టే ధోరణిని ఆయన వద్ద ఎండగట్టారు. పాక్‌ ప్రధాని ఉపయోగిస్తున్న తీవ్ర పదజాలంతో ప్రాంతీయంగా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వివరించారు. ఉగ్రవాదానికి ముగింపు పలికాలని ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన క్రమంలో ఏర్పడిన పరిణామాలను ట్రంప్‌కు వివరించారు. ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన త‌ర్వాత‌.. ఇమ్రాన్‌తోనూ ట్రంప్ ఫోన్ మాట్లాడారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని.. మృదువుగా సంభాషించాలంటూ ఇమ్రాన్‌తో ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఈ స‌మావేశం అనంత‌రం ట్రంప్ ట్వీట్ చేస్తూ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. 


ప‌రిస్థితి కొంత ఆందోళ‌న‌క‌రంగానే ఉన్నా.. కానీ ఇద్ద‌రితోనూ మంచి సంభాష‌ణ జ‌రిగిన‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు. ``ఇద్ద‌రు మంచి మిత్రులు.. భార‌త్‌, పాకిస్థాన్ ప్ర‌ధానుల‌తో ఫోన్‌లో మాట్లాడాను`` అని ట్రంప్ తెలిపారు. వాణిజ్యం, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం అంశాల‌ను చ‌ర్చించిన‌ట్లు చెప్పారు. క‌శ్మీర్ అంశంలో రెండు దేశాలు ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరిన‌ట్లు ట్రంప్ త‌న ట్వీట్‌లో తెలిపారు. క‌శ్మీర్ అంశంపై రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలంటూ వైట్‌హౌజ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ వేసిన ఫ‌లించింద‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: