ఆయన సీనియర్  మోస్ట్ నాయకుడు. అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి నిన్నటి వరకూ అత్యున్నతమైన రాజ్యాంగ పదవి స్పీకర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి. అటువంటి కోడెల శివప్రసాదరావు మీద ఓ విచిత్రమైన ఆరోపణ వచ్చింది. అది విన్న వారికి వెంటనే కలిగే సందేహం కోడెల ఇలా చేసి ఉంటారా అని. ఆయన లాంటి పెద్ద మనిషి ఇలాగ కూడా చేస్తారా అని. విషయమేంటంటే కోడెల సివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్ ని తన ఇంటికి తరలించుకుపోయారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు . రాజ్యాంగ పదవి చేపట్టి ఇదేం పని అంటూ గట్టిగానే నిలదీస్తున్నారు. 


అప్పట్లో  హైదరాబాద్ నుంచి అమరావతికి అసెంబ్లీ తరలి వెళ్లిన సమయంలో హైదరాబాద్ ఆఫీస్ కు చెందిన ఫర్నిచర్ ను ఎవరికి చెప్పకుండా కోడెల గుంటూరు, సత్తెనపల్లిలలోని తన క్యాంప్ కార్యాలయాలకు, తరలించారని ఆరోపణ వచ్చింది.  దీని మీద అదికారులకు కూడా సమాచారం చెప్పకుండా కోడెల ఇలా లారీలలో తరలించారని అబియోగాలు వచ్చాయి.  అయితే కోడెల  దీని మీద వివరణ ఇస్తూ తాను పర్నిచర్ ను తీసుకు వెళ్లిన మాట నిజమేనని, అయితే హైదరాబాద్ అసెంబ్లీలో ఫర్నిచర్ కు భద్రత ఉండదనే తీసుకువెళ్ళాలని చెప్పడం విడ్డూరమే.  నిన్నటి  ఎన్నికల తర్వాత ఆ పర్నిచర్ తీసుకువెళ్లాలని అదికారులకు చెప్పానని ఆయన అన్నారు.


అంటే ఒక వేళ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే కోడెల ఆ సామగ్రి ప్రభుత్వానికి అప్పగించారా అన్నది ఒక డౌట్. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిన తరువాత కూడా తాను ఇప్పటికీ అప్పగించకపోవడం ఇంకొక డౌట్. చివరకి వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం వల్ల మాత్రమే కోడెల రికవరీకి ఓకే అంటున్నారన్నది ఇపుడు మరో మాట. కాగా, అనేక రకాలుగా అవినీతి   రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న నేతగా  చివరికి అసెంబ్లీ ఫర్నిచర్ ను కూడా ఇంటికి తరలించుకుపోయిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా ఏ చర్య తీసుకుంటారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.


కోడెల చేసిన పనికి నర్సారావుపేట పరువు పోయిందని, ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నరని కూడా ఆయన అన్నారు. అలా కొట్టేసిన ఫర్నీచర్‌ని గుంటూరులోని గౌతమ్‌ హోండా షోరూమ్‌లో పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారులు నిలదీయడంతో చేసిన తప్పును ఒప్పుకున్నారని, ప్రపంచంలో కోడెల లాంటి స్పీకర్‌ మరొకరు ఉండరని ఎద్దేవా చేశారు.   ఇక ఫర్నిచర్, కంప్యూటర్ల కు ఎంత విలువ అవుతుందో లెక్క చెబితే దానిని చెల్లిస్తానని కోడెల అన్నారని భోగట్టా.


అయితే పోలీసులు కేసు పెట్టబోతున్న తరుణంలో కోడెల ఇప్పుడు డబ్బు చెల్లిస్తానని అంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి తాను ప్రభుత్వ ఫర్నిచర్, విలువైన  సామగ్రి తీసుకువెళ్ళలని కోడెల స్వయంగా అంగీకరించడం విశేషం. దీని మీద వైసీపీ సర్కార్ స్పీకర్ కి ఫిర్యాదు చేసి కోడెల మీద చర్యలకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: