సైబర్ నేరగాళ్ళు గ్రామాలలో అమాయక ప్రజలని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ ఖాతాలలో డబ్బు దోచుకుంటున ఘటనలు అనేకం చూశాం. సహజంగా ఫోన్ ద్వారా మాటలు కలిపి వివరాలు అడిగి తెలుసుకుని అమాయక ప్రజల సొమ్ము స్వాహా చేయడం పరిపాటిఅయ్యింది. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు సరికొత్త పంధాని ఎంచుకున్నారు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థని తమకి అనుకూలంగా మలుచుకుంటున్నారు.

 Image result for cyber crime villages

పశ్చిమగోదావరి జిల్లాలోని కొయ్యాల గూడెం లో జరిగిన ఓ సంఘటన అందుకు నిదర్సనం. గ్రామ వాలంటీర్లమంటూ వచ్చిన కొందరు వ్యక్తులు, మీకు సేవ చేయడానికి మమ్మల్ని నియమించారు , మీకు ఏ విధమైన సాయం కావాలన్నా సరే మేము తప్పకుండా చేసి పెడుతాము అంటూ మాటలు కలిపారు. ఆ తరువాత మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలు చెప్పండి, ఫింగర్ ప్రింట్ వేయండి అంటూ వివరు తీసుకుంటూ ఈ వివరాలు చెప్పక పొతే మీకు ప్రభుత్వ పధకాలు వర్తించవు అంటూ నమ్మబలికారు.

 

ప్రభుత్వ పధకాలు నిజంగానే రావని అనుకున్న అమాయక ప్రజలు తమ వివరాలు అన్నీ వాలంటీర్ల ముసుగులో వచ్చిన వారికి చెప్పేశారు. మళ్ళీ వస్తామని చెప్పి అక్కడి నుంచీ వాళ్ళు వెళ్ళిపోయినా కొంత సమయానికి వారి మొబైల్స్ కి వచ్చిన మెసేజ్ చూసి షాక్ తిన్నారు. వారి ఖాతాలలో సొమ్ము మాయం అయ్యింది అంటూ లబోదిబోమంటూ బ్యాంక్ లకి వెళ్లి ఆరాతీశారు. ఈ ఘటన మండల స్థాయిలో తెలియడంతో పాటు పోలీసులకి సంచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ్రామ వాలంటీర్ల వ్యవస్థని దెబ్బ కొట్టడానికే ఇది కుట్ర పూర్తిటంగా జరిగిందని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ కుట్ర వెనుకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: