ఇప్పటికే కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతి పత్తిని కేంద్రం రద్దు చేసి తరువాత తమ ద్రుష్టి ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద అని కేంద్రం చెప్పేసింది. ఒక వేళ యుద్ధం గాని జరిగితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఓడిపోతుంది. పనిలో పనిగా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు చొచ్చుకొని వెళ్లి పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండేది బీజేపీ ప్రభుత్వం .. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అంత దూరం ఆలోచించే పార్టీ కాదు. అందుకే ఇప్పుడు పాకిస్థాన్ యుద్దానికి కాలు దువ్వినా పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని కోల్పోవటం ఖాయం. ఒక్క సారి యుద్ధం జరిగాక తరువాత ఎన్ని ఒప్పందాలు జరిగినా .. ఇండియా మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వదిలి పెట్టదు. 


కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం తొలిగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసి, భారత్ తన భూ భాగంలో కలిపేసుకుంది. దీనితో పాకిస్థాన్ ఎక్కడ లేని ఆందోళనకు గురైంది. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లి ట్రంప్ తో మాట్లాడి కాశ్మీర్ విషయాన్ని రెచ్చగొట్టానని చాలా అనందం పడ్డారు. ట్రంప్ కూడా నేను మధ్య వర్తిత్వం చేస్తానని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ చాలా సంతోష పడ్డారు. ఎప్పటికైనా కాశ్మీర్ ను తాము దక్కించుకుంటామని పాకిస్థాన్ అనుకుంటూ వచ్చింది.


అయితే నరేంద్ర మోడీ ఇమ్రాన్ ఎత్తులకు పై ఎత్తు వేసి అస్సలు కాశ్మీర్ కు ఉన్న అధికారాలను తొలిగించి ఏకంగా భారత్ లో కలిపేశారు. దీనితో ఇమ్రాన్ కు మాస్టర్ స్ట్రోక్ తగిలింది. ఇన్ని రోజులు కాశ్మీర్ .. కాశ్మీర్ అని అరిచి గోల చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అది భారత్ లో పూర్తిగా అంతర్భాగం అయిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. భారత్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని అక్కడి సైన్యం కూడా ఎదురు చూస్తుంది. పాక్ యుద్ధం చేయాలనుకుంటుందో ఏమో గాని ఇప్పటీకే లడఖ్ ప్రాంతంలోకి యుద్ధ విమానాలును దింపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: