ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది.  2014 ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న టీడీపీ.. ఆ తరువాత ఆపరేషన్ గులాబీ దెబ్బకు అందరు కారెక్కి వెళ్లిపోయారు.  ఇప్పుడు అక్కడ ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.  ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది.  అయితే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత నెంబర్ 2 గా ఉన్న నేత దేవేందర్ రెడ్డి ప్రస్తుతం టిడిపిలోనే ఉన్నారు.  


తెలుగుదేశం పార్టీ నుంచి ఒకప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో.. తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.  అయితే, గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో మనుగడ సాగించలేకపోతున్నది.  చరిష్మా కలిగిననేతలు లేకపోవడంతో ఇబ్బందుల్లో పడింది.  ఇక, తెలంగాణాలో బీజేపీ పుంజుకోవడంతో తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారు.  


బీజేపీలో ఇప్పటికే వందలాది మంది నేతలు జాయిన్ అయ్యారు.  ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో పట్టున్న నేతలను బీజేపీ ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దేవేందర్ రెడ్డి బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం దేవేందర్ గౌడ్ ఢిల్లీ వెళ్తున్నారు.  సామాజిక న్యాయం’పై దిల్లీలోని కాన్‌ స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. తర్వాత రాష్ట్రపతి కోవింద్‌ తోపాటు ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో భాజపా అగ్రనేతల్ని దేవేందర్‌ గౌడ్‌ కలిసే అవకాశమున్నట్లు ఆ పార్టీ నేతల సమాచారం. 


ఢిల్లీ నుంచి వచ్చినా తరువాత దేవేందర్ గౌడ్ బీజేపీలో చేరే విషయంపై ఆలోచించే అవకాశం ఉన్నది.  ఒక్క దేవేందర్ గౌడ్ మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది సీనియర్ నేతలు బీజేపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు.  వారితో మంతనాలు జరుపుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: