తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ని తాము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్న నగరి ఎమ్మెల్యే రోజా , ఆయన్ని ప్రజలే టార్గట్ చేసి ఇంటికి పంపారని అన్నారు . రాష్ట్రం లో ప్రాజెక్టులు నిండు కుండలా నిండడం తో  ఓర్వలేకనే చంద్రబాబు , ప్రభుత్వం పై బురద చల్లేందుకు ఏవేవో మాట్లాడుతున్నారని ఈమె ధ్వజమెత్తారు . వరద అంచనాల కోసం డ్రోన్ వినియోగాన్ని కూడా రాజకీయం చేయడం దారుణమని మండిపడ్డారు .


ముఖ్యమంత్రి హోదా లో కృష్ణానది కరకట్ట పై నిర్మించిన ఇంటి లో నివసించడమే కాకుండా , ఇప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రోజా విమర్శించారు . కరకట్ట పై నిర్మించిన అద్దె ఇంటిలో చంద్రబాబు నివసిస్తోన్న విషయం తెల్సిందే . అయితే ఆ  ఇంటిని ఖాళీ చేయాలని వరదల సమయం లో  ఆయనకు రెవెన్యూ శాఖా నోటీసులు కూడా జారీ చేసింది . కృష్ణానది కి  వరద ఉదృతి  అధికంగా ఉండడం తో ముంపు ప్రాంత ప్రజలను కాపాడడమే లక్ష్యంగా నోటీసులు జారీ చేసినట్లు  రెవెన్యూ శాఖ అధికారులు చెప్పారు . అయితే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి తన ఇంటిని ముంచిందన్న చంద్రబాబు , తన ఇంటిని ముంచాలనుకుంటే పేదల ఇల్లు మునిగామని ఆయన అన్నారు .


వరదను సక్రమంగా అంచనా వేసి  ప్రకాశం బ్యారేజ్ లో నీటిని కిందకు వదలకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిల్వ చేశారని , దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు . వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు, బాధితులను పరామర్శించారు .చంద్రబాబుకు బాధితులు  తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకొచ్చారు . బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసానిచ్చారు .


మరింత సమాచారం తెలుసుకోండి: