భారతీయ జనతా పార్టీకి మత రాజకీయాలు ఏమీ కొత్త కాదు. అయితే ఈ మధ్య 370 అధికరణ రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు వంటివి చేసి కొంచెం మంచి పేరు సంపాదించింది. కానీ కుక్క తోక వంకర అన్నట్టు వాళ్ళ బుద్ధి మరోసారి బయటపడింది. ఏపీలో జగన్ ని ఏమి చేయలేక చివరికి అతనికి మతస్థుడు అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను, నవరత్నాలను కచ్చితంగా అమలు పరుస్తున్న ముఖ్యమంత్రిపై ఓర్వలేక వారు చేసిన ఆరోపణలు చివరికి బెడిసికొట్టాయి. చివరికి వారికే ఒక రేంజిలో అవమానం మిగిల్చింది. 

వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం డల్లాస్ లో  పర్యటిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఒక ఒక సభకు హాజరయ్యారు. మామూలుగా మన దేశంలో ఇటువంటి సభల్లో ముఖ్య అతిథిగా చేత జ్యోతి ప్రజ్వలనం చేయిస్తారు. అలాగే డల్లాస్ లో కూడా అక్కడి నిర్వాహకులు అలాంటి ఏర్పాటునే ఒకటి చేశారు. ఆ జ్యోతి ప్రజ్వలనం సమయంలో తీసిన ఒక వీడియోని ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఒక ట్వీట్ వేసింది. ‘‘వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంది" అని జగన్ పై మతస్థుడు అనే ముద్ర పడేటట్లు గా సీఎం రమేశ్ ట్వీట్ వేశారు. దీనినే భారతీయ జనతా పార్టీ కూడా రీట్వీట్ చేశారు.

వెంటనే ట్విట్టర్ మరియు అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో ఉన్న జనాలంతా దీన్ని తీవ్రంగా విమర్శించారు. అక్కడ ప్రత్యక్షంగా డల్లాస్ లో ఉన్న వారు కూడా దీనిపై వివరణ ఇచ్చారు. యూ.ఎస్ లో అటువంటి బహిరంగ ప్రదేశాలలో అగ్గిపుల్ల వంటివి వెలిగించడం నిషేధం. ప్రాకృతికంగా నిప్పుని రాజెయ్యరాదు అని అక్కడ అంశాలు ఉన్నాయి. పైగా బిజెపి పెట్టిన వీడియోలో ఒకతను జగన్ ను ఆ దీప స్తంభానికి కింద ఉన్న స్విచ్ ను నొక్కమని చెప్తూ కనిపిస్తాడు. దీనిని బట్టి అది ఒక ఎలక్ట్రానిక్ దీప స్తంభం అని చెప్పవచ్చు. విద్యుత్ కారణంగా వచ్చే మంట తోనే అక్కడ జ్యోతి ప్రజ్వలన సాధారణంగా పూర్తి చేస్తారు.

ఈ విషయం తెలియక మన బిజెపి నేతలు దొరికిందే సందు అంటూ జగన్ పైన బురద చల్లేందుకు ప్రయత్నించారు. చివరికి అందరి ముందు నవ్వులపాలు కావడమే కాకుండా వారు ఇన్ని రోజులుగా చేస్తున్న మతపరమైన రాజకీయాలకు ఒక కొత్తదనం నిదర్శనాన్ని తెరలేపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: