ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో వరద భాదితులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయటానికి తీసుకెళుతున్న హెలికాఫ్టర్ కూలిపోయింది. గత కొంత కాలంగా ఉత్తారాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో గ్రామాలు, పట్టణాలు వరద ముంపుకు గురవుతున్నాయి. వరద బాధితులకు సహాయం చేయటం కొరకు తీసుకెళుతున్న హెలికాఫ్టర్లోని ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 
 
ఉత్తర కాశీ జిల్లాలోని మోరీ అనే ప్రాంతం నుండి మోల్దీ అనే ప్రాంతానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయటానికి తీసుకొనివెళుతున్న హెలికాఫ్టర్ కూలిపోయింది. హెలికాఫ్టర్ ప్రయాణించే సమయంలో కరెంట్ తీగలు తగలటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు త్వరగానే స్పందించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 
 
అరాకోట్ అనే ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, హెలికాఫ్టర్ కు చెందిన సిబ్బంది ఒకరు మరణించారని తెలుస్తోంది. పోలీసులు ఈ హెలికాఫ్టర్ ను ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాఫ్టర్ గా గుర్తించారు. ఉత్తర కాశీలో భారీ వర్షాల కారణంగా 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు 80 ఇళ్ళు కూలిపోగా 120 ఇళ్ళు పాక్షికంగా దెబ్బ తిన్నట్లు సమాచారం అందుతోంది.  భారీ వర్షాల వలన 5 వంతెనలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

15 కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాలని తెలుస్తుంది. ఉత్తరాఖండ్ లో 2013 సంవత్సరంలో కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాఫ్టర్ కూలిపోయింది. కేదరినాథ్ నుండి ప్రయాణిస్తుండగా గౌరీకుండ్ అనే ప్రాంతంలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. అప్పుడు జరిగిన ప్రమాదంలో 38 మంది మరణించారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: