ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అనేక ప్రాంతాలను పరిశీలించారు.  చివరకు అమరావతిని ఎంచుకున్నారు.  ఆంధ్రుల రాజధాని అమరావతి అని, దేవేంద్రుడు రాజధాని పేరును దేనికి పెట్టి రాజధానిగా నిర్మించాలని అనుకున్నారు.  కృష్ణ, గుంటూరు పరిసర ప్రాంతాల రైతుల నుంచి భూమిని సేకరించి రాజధానిని ఏర్పాటు చేశారు.  



అయితే, రాజధాని ఏర్పాటు జరిగిందికాని, ప్లానింగ్ ఆలస్యం అయ్యింది.  కోట్లాది రూపాయలు ప్లానింగ్ ఖర్చు చేశారు.  శాశ్వత నిర్మాణాల స్థానంలో కేవలం తాత్కాలిక నిర్మాణాల ఏర్పాటు జరిగింది.  వర్షం కురిస్తే రాజధానిలోని అసెంబ్లీ భవనం తడిసిపోతుంది.  పైగా రాజధానికి వరద ముప్పు ఉన్నది.  ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే భారీ వరద వస్తే.. ఆ ప్రాంతం మునిగిపోతుంది.  



కాబట్టి అక్కడ రాజధానిని ఏర్పాటు చేయడానికి వీలు లేదని గతంలో కొంతమంది మేధావులు చెప్పినా వినలేదు.  ఇప్పుడు భారీ వరద రావడంతో మరోమారు అమరావతి గురించి చర్చకు వచ్చింది.  అమరావతిలో రాజధానిని నిర్మించాలా వద్దా అనే చర్చ జరుగుతున్న సమయంలో.. రాజధానిని మారుస్తున్నారని వదంతులు వచ్చాయి.  ఇలా మార్చడం జరగని పని అని తెలుసు.  



రాజధానిని మారుస్తున్నట్టు ప్రభుత్వం చెప్పలేదు. ఆ దిశగా మాత్రం పుకార్లు వస్తున్నాయి.  ఇక్కడ విషయం ఏమిటంటే.. గతంలో వైకాపా రాజధానిని దొనకొండ ప్రాంతంలో ఉంటె బాగుంటుందని భావించింది.  ఇప్పుడు అక్కడేమైనా నిర్మిస్తున్నారు అన్నది డౌట్.  అయితే, మరో నేత చింతా మోహన్ మరో వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. 


రాజధానిగా తిరుపతి ఏర్పాటు చేయాలనీ, అన్ని వసతులు ఉంటాయని అంటున్నాడు.  ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ పోతున్నారు.  దీంతో ప్రజలు అయోమయంలో పడిపోయారు.  ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.  అప్పటి వరకు పాపం ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు.  అటు అక్కడ భూములు కొన్నవారి వారుకూడా ఇరకాటంలో పడ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: