ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు చర్చగా నిలుస్తున్న విషయం రాజధాని ఎక్కడ అంశం.దీని పై ఒక్కక్కొరు ఒక్కొక్క విధంగా వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే దొనకొండ ను ఏపీ రాజధానిగా మార్చాలనే యోచనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఏ వసతులు లేని దొనకొండ కంటే తిరుపతిని రాజధానిగా చేయాలని అన్నారు మాజీ ఎంపి చింతా మోహన్. విద్యాపరంగా, రవాణాపరంగా తిరుపతి ఎంతో అభివృద్ధి చెందిందని తిరుపతి వాతావరణం కూడా బాగుంటుందని అన్నారు.


రాజధానికి తిరుపతే అనువైన ప్రదేశమన్నారు చింతా మోహన్. రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబునాయుడు తొందర పడుతుంటే తొందర పడవద్దంటూ నేను చెప్పానని చింతా మోహన్ తెలిపారు. మళ్ళి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నాను దొనకొండ విషయంలో తొందరపడ వద్దని తొందరపడితే అక్కడ జల వనరులు లేవు, రైల్వే మార్గం లేదు, రవాణా సౌకర్యాలు లేవు, కనీసం కావల్సినటువంటి ఆసుపత్రులు గాని, విద్యాసంస్థలు గానీ, ఏమీ లేవని, ఇటువంటి దొనకొండ వెనుక బడిన ప్రాంతమైన అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని చింతా మోహన్ తెలియజేశారు.


ఆమోదయోగ్యం లేనటువంటి దొనకొండ కంటే తిరుపతి కొండ అయితే మంచిదని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నానని మోహన్ తెలిపారు. తిరుపతి కొండ కాకుండా ఏది రాజధాని చేసిన అది నిలబడదని, నాలుగు వందల సంవత్సరాల నాడు కడప నుంచి ఒక సెయింట్ వచ్చారని ఆయన పేరు బ్రహ్మంగారని, ఆయన తిరుపతి రాజధాని అవుతుంది ఎవరూ ఊహించని సమయంలో అని ఆయన పత్రాల్లో కూడా తిరుపతి రాజధాని అవుతుందని రాశారని మోహన్ తెలియజేశారు



. తిరుపతిలో అన్ని వసతులున్నాయని, ఏడు జాతీయ రహదారులున్నాయని, ఏడు విశ్వవిద్యాలయాలున్నాయని, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, ఆరోగ్యపరంగా అన్ని సంస్థలూ ఉన్నాయి. విద్యారంగంలో ఐఐటీ, ఐసర్ లాంటి పెద్ద పెద్దవి వచ్చాయి. అన్నిటి కంటే మించింది వాతావరణం, హైదరాబాద్ అందరూ ఇష్టపడటానికి కారణం అక్కడ వాతావరణం తిరుపతి వాతావరణం చాలా బాగుంటుంది. అక్కడ వరదలు రావు, భూకంపాలు రావు, ఏమీ రావు అందుకే వెంకటేశ్వరస్వామి వచ్చి ఇక్కడ కుర్చున్నారని మొహన్ తెలిపారు. ఇది రాయలసీమకి, ఇటు కోస్తాంధ్రకు ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: