ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి.  2014లో రాజధానిగా అమరావతిని నిర్ణయించారు.  భూమి పూజ కూడా అట్టహాసంగా జరిగింది.  సింగపూర్ నుంచి వచ్చిన అర్చిటెక్ట్ లు ప్లాన్ రెడీ చేశారు.  వారు తయారు చేసిన ప్లాన్ నచ్చకపోవడంతో జపాన్ వాళ్ళు తయారు చేశారు.  అదీ బాగాలేదు.  లండన్ కు చెందిన ఓ కంపెనీ ప్లాన్ రెడీ చేసింది.  అద్భుతంగా ఉండటంతో ఒకే చేశారు.  


అప్పటికే మూడేళ్లు దాటింది.  ఈలోగా అక్కడ తాత్కాలిక భవనాల ఏర్పాటు జరిగింది.  ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వానికి బీజేపీ కి మధ్య రగడ.. విడిపోవడం జరిగిపోయాయి.  2019 వచ్చింది.. ఎన్నికలు జరిగాయి.  పార్టీ ఓటమిపాలైంది.  వైకాపా అధికారంలోకి వచ్చింది.  అమరావతి రాజధానిని వైకాపా  ఉన్నది.  


అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం వలన ముంపు వస్తుందని, ఫలితంగా రాజధాని మునిగిపోతుందని వాదించడం మొదలు పెట్టింది.  దీనికి ఊతం ఇస్తూ.. మంత్రి బొత్స కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈ మాటలు నిజమే అని అనుకున్నారు.  దీంతో అమరావతిలో అలజడులు మొదలయ్యాయి.  ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వాళ్ళు లబోదిబో అంటున్నారు. 


మరోవైపు అమరావతి కాకుండా రాజధానిని దొనకొండలో ఏర్పాటు చేస్తారని వార్తలు రావడంతో.. అక్కడ ఒక్కసారిగా భూమ్ వచ్చింది.  రేట్లు అమాంతం పెరిగాయి.  దొనకొండ ప్రాంతంలో ఉన్న రైతుల భూములకు రెక్కలు వచ్చాయి.  అయితే, దొనకొండతో పాటు తిరుపతిని కూడా పరిశీలించాలని తెరపైకి వచ్చింది.  తిరుపతి అయితే అన్ని రకాలుగా ఆమోదయోగ్యంగా ఉంటుందని కొందరి వాదన.  


తిరుపతిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.  ఇప్పటికే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది.  రవాణా మొదలు అన్ని సౌలభ్యంగా ఉంటాయి.  రాయలసీమ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.  పైగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి అందరికి బాగుంటుందని వార్తలు వినిపించాయి.  మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నదో తెలియదుగాని, ఈ వార్త మాత్రం అలా వ్యాపిస్తూనే ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: