చంద్రయాన్ టూ విజయవంతంగా ఆకాశానికి ఎగసింది. ఇది చంద్ర కక్షలో విజయవంతంగా తిరుగుతుందని సమాచారం అందింది.  హైటెన్షన్ రాకెట్ ప్రయోగించేటప్పుడు ఉన్నప్పటి కంటే రెట్టింపు టెన్షన్, గుండె ఆగి పోతుందేమో అన్నంత ఉత్కంఠ, గండం గడిచింది అని అది గగనలోకి ఎగసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆనందం చంద్రమామ మన చేతికి చిక్కిన అంత ఆనందం. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ టు కీలకమైన దశను విజయవంతంగా పూర్తి చేసింది. మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కిలోమీటర్ల ప్రయాణించిన ఉపగ్రహం భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకు చంద్రుడి కక్ష్య లోకి భద్రంగా చేరింది.



ఇదేదో  హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న అంత ఈజీగా చంద్రయాన్ ప్రయోగంలోని అత్యంత క్లిష్టమైన దశలో ఇది ఒకటి నిర్దిష్ట వేగం కంటే కాస్త ఎక్కువగా ఉన్న అనంతమైన అంతరిక్షంలో ఎక్కడికో కొట్టుకుపోతుంది. వేగం ఏమాత్రం తగ్గినా చంద్ర ఆకర్షణకు లోనై చంద్రుడి ఉపరితలంపై పడి ధ్వంసమైపోతుంది. అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియ నడిపించాల్సి ఉంటుంది. మంగళవారం మాడ్యూలులోనే ద్రవ ఇంధన ఇంజన్ ను పదిహెడు వందల ముప్పై ఎనిమిది సెకన్ల పాటు మండించి చంద్ర కక్షలో కి చేరుకునేలా చేశారు. బెంగళూరు సమీపం లోని బైలాలు వద్ద ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ ఐటి నెల సహకారంతో శ్రీహరికోట లోని మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రక్రియ ను విజయవంతంగా పూర్తి చేశారు. చంద్రుడి కక్ష్య లోకి చేరిన మాడ్యూల్ అక్కడ చందమామకు నూట పద్నాలుగు కిలోమీటర్ల దగ్గరగా పధ్ధెనిమిది వేల డెబ్బై రెండు కిలో మీటర్ల దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు చంద్ర కక్షలో సంచరించడం ప్రారంభించారు.



చంద్రయ్య అంటూ చంద్ర కక్ష్య లోకి చేరిన నేపథ్యంలో ఇక అసలు గమ్యానికి మనం కేవలం నాలుగడుగుల దూరంలో నిలిచినట్లైంది. ఒక్కొ అడుగు అంటే ఒక్కొ కక్ష్యను మారుస్తూ చంద్రుడ్ని మరింత సమీపించటం. బుధవారం మాడ్యూల్ ను మరో కక్ష్య లోకి చేరుస్తారు. ఆ తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిది ముప్పై తేదీల్లో, వచ్చే నెల ఒకటవ తేదీ కక్ష మార్పు ప్రక్రియను పూర్తి చేస్తారు. అప్పటికీ చంద్రయ్య అంటూ చందమామ ఉపరితలానికి వంద కిలో మీటర్ల ఎత్తు లోని వృత్తాకారపు కక్ష్య లోకి చేరుతుంది. ఆ మరుసటి రోజునే అంటే సెప్టెంబర్ రెండవ తేదీ న మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ ను వేరు చేస్తారు. అనంతరం ల్యాండర్ లోని ద్రవ ఇంధన ఇంజన్ ను రెండు సార్లు స్వల్పకాలంపాటు మండించి చంద్రుడికి వంద కిలోమీటర్ల దూరం ముప్పై ఐదు కిలోమీటర్ల దగ్గరగా వుండే కక్షలోకి చేరుకునేలా చేస్తారు. ఇక చంద్రయాన్ టూ లో అత్యంత కీలకమైన ఆఖరి ఘట్టం సెప్టెంబర్ ఏడవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు జరుగుతుంది. ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. సెప్టెంబర్ 7వ తేదీన మనం చందమామకు చేరువవుతామా మరియు విజయవంతంగా ల్యాండర్ విజయవంతంగా దిగుతుందా లేదా అనేది వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: