చిదంబరం అంటే చిన్న నాయకుడు కాదు, కాంగ్రెస్ లో చక్రం తిప్పిన నాయకుడు. యూపీయే వన్, టూ సర్కార్లలో చిదంబరం ఆర్ధిక మంత్రిగా, హోం మంత్రిగా పనిచేశారు. ఆయన అప్పట్లో కింగ్ లా బతికారు. ఆయన అన్నదే వేదంగా సాగింది. చీకట్లో చిదంబరాన్ని కలసిన చంద్రబాబు సేఫ్ అయ్యారని అంటారు. అదే చంద్రబాబు జగన్ మీద కేసులు పెట్టాలని కూడా ఉసిగొల్పారని వైసీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూంటారు.


మొత్తానికి ఎవరెన్ని చెప్పుకున్నా చిదంబరం అరెస్ట్ కావడం అంటే బిగ్ పొలిటికల్ ట్విస్ట్ గానే భావించాలి. సీబీఐ ఈ మధ్య కాలంలో ఇంతటి బిగ్ షాట్ ని వల వేసి జైలు కి పంపించిన రికార్డ్ లేదు. పైగా ఆయన ఒకపుడు సీబీఐకి బాస్. తాను చెప్పినట్లుగా సీబీఐని ఆడించిన ఘనత ఆయనకే సొంతం. గిట్టని వారిని జైలు పాలు చేసి వినోదం  చిత్తగించే మాజీ బాస్ కి ఇపుడు అదే సీబీఐ సంకెళ్ళు వేయడం అంటే విధి ఎంత విచిత్రమో అనిపిస్తుంది.


ఇక చిదంబరం మీద కేసులు ఏంటి, ఆ కధా కమామీష్ ఏంటి అన్నది ఒకసారి  చూసుకుంటే 2007లో కేంద్రమంత్రిగా ఆయన ఉన్నపుడు 305 కోట్ల విదేశీ పెట్టుబడులు అందుకోవడానికి 
ఐఎన్ ఎక్స్ మీడియాకు ఎఫ్ ఐపీబీ ఆమోదం తెలిపింది. ఎఫ్ ఐపీబీ  ఆమోదం వెనక చిదంబరం ఉన్నారన్నది సీబీఐ ఐడీ వాదన. ఈ నగదు అందుకున్న కంపెనీల వెనక చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఉన్నాడని కూడా అభియోగం.  దీని మీద 2017 మే 15న సీబీఐ కేసు చిదంబరం మీద నమోదు అయింది. ఇక దీనితో పాటు 3,500 కోట్ల రూపాయల ఎయిర్ సెల్ మ్యాక్సిస్ ఒప్పందంలోనూ చిదంబరంపైన అవినీతి  ఆరోపణలు ఉన్నాయి.


మొత్తం మీద హై డ్రామా అనంతరం చిదంబరం ఆయన నివాసంలోనే  అరెస్ట్ కావడం అంటే ఓ విధంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా భావించాలి. చిదంబరం కేసు కుట్ర అని, కేంద్రంలోకి మోడీ సర్కార్ వేధిస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరొపణలను పక్కన పెడితే ఈ కేసులో బలమైన ఆధారాలు ఉండబట్టే కోర్టులు కూడా అరెస్ట్ మీద స్టే ఇవ్వకుండా విచారణకు అనుమతించాయనుకోవాలి. మొత్తానికి చూసుకుంటే చిదంబరం జీవిత చరమాంకంలో కోర్టుల చుట్టూ తిరగడమే కాదు, జైలు కు వెళ్లాల్సిరావడం విషాద‌కరమే.



మరింత సమాచారం తెలుసుకోండి: