కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని  అరెస్టు చేయటాన్ని తెలుగు ప్రజలు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. చిదంబరాన్ని అరెస్టు చేయాల్సిందే అంటూ గట్టిగా చెబుతున్నారు. వివిధ టివి చర్చల సందర్భంగా ఫోన్ చేసిన కాలర్స్ లో అత్యధికులు చిదంబరం అరెస్టు చేయటానికి ఎందుకు మద్దతు పలుకుతున్నారు ?

 

దీని వెనుక పెద్ద కథే ఉంది. కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే 2014లో రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చిదంబరమే అనే అభిప్రాయం మెజారిటి ప్రజల్లో ఉంది. పచ్చగా కళకళలాడుతున్న ఏపి అన్నీ రంగాల్లో తమిళనాడు రాష్ట్రంతో పోటీ పడుతోంది. కొన్ని రంగాల్లో తమిళనాడును మించిపోతోంది. దాంతో ఏపిని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయటంలో కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం జనాల్లో బలంగా వినిపించింది.

 

ప్రత్యేక తెలంగాణా సాధనకు డిమాండ్ ఉన్నప్పటికి నిజానికి అప్పట్లో అంత సెంటిమెంట్ అయితే లేదు. డిమాండ్ ను అవకాశంగా తీసుకున్న చిదంబరం చాలా స్పీడుగా పావులు కదిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై అప్పట్లో కేంద్రం నియమించిన కమిటిలో చిదంబరమే కీలక పాత్ర పోషించారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపటం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అంగీకరింపచేయటం లాంటి తెరవెనుక వ్యవహారాలు నడపటంలో చిదంబరమే కీలకమనే అభిప్రాయం జనాల్లో కనిపించింది.

 

సరే ఆ విషయాన్ని పక్కనపెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పదేళ్ళ క్రితం అరెస్టు చేయటంలో కూడా చిదంబరమే కీలకమని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి అధికారాన్ని ధిక్కరించి మరీ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. దాంతో జగన్ పై కుట్ర  చేసి ముఖ్యనేతలంతా కలిసి చిదంబరాన్ని ముందుపెట్టి జగన్ పై సిబిఊ, ఈడిలతో కేసులు పెట్టించినట్లు కాలర్స్ అంటున్నారు. కాబట్టే చిదంబరం అరెస్టుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫుల్లుగా హ్యాపీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: