ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు దారుణంగా మారిపోయాయి.  ఆర్టికల్ రద్దు జరిగి 20 రోజులు కావొస్తున్నా.. ఇంకా పాక్ ఇండియాపై బురదజల్లుతూనే ఉన్నది.  అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నది.  అలా చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొడుతున్నా.. ఆపడం లేదు.  పదేపదే అమెరికాకు కంప్లైంట్ చేయడం.. ఐక్యరాజ్యసమితిలో కంప్లైంట్ చేయడం వంటివి చేస్తూనే ఉన్నది.  


తమకు అంతర్జాతీయంగా మద్దతు లేదు అంటూనే.. ఇలా ఎందుకు చేస్తున్నదో అర్ధంకావడం లేదు.  ఇండియాపై బురదజల్లేందుకు అవకాశం ఉన్న ఏ అంశాన్ని కూడా వదలడం లేదు.  తాజాగా ఈ అంశంలోకి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను లాగింది.  ప్రియాంక చోప్రా 2016లో యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించారు.  ప్రియాంక చోప్రా గుడ్ విల్ అంబాసిడర్ గా ఉంటూ.. కేవలం తన సొంత దేశానికి మాత్రమే పనిచేస్తున్నదని.. మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదని పాక్ వాపోతున్నది.  


భారత్ అణ్వస్త్ర విధానం.. పాక్ కు ముప్పు వాటిల్లబోతుందని, కానీ ప్రియాంక చోప్రా భారత నిర్ణయాలను సమర్ధిస్తోందని, ఆమెను యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా తొలగించాలని కోరుతూ.. పాక్ మానవ హక్కుల మంత్రి యూనిసెఫ్ కు లేఖ రాసింది.  యూనిసెఫ్ కు లేఖ రాసినట్టు మంత్రివర్గం ట్విట్టర్ లో పేర్కొంది.  కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఈ విధంగా రచ్చ చేస్తుందని ఊహించలేదు.  ఎందుకు జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ ఇలా రచ్చచేస్తుందో తెలియడంలేదు.  


ఉపఖండంలో భారత్ బలపడటంతో పాటు అంతర్జాతీయంగా ఇండియాకు పేరు వస్తుండటం.. చైనాతో పోటీ పడుతూ ఆర్ధికంగా బలంగా మారుతుండటం చైనాకు, ఇటు పాకిస్తాన్ కు నచ్చడం లేదు.  భారత్ ను అస్థిర పరచాలి అంటే ఇండియాలో అంతర్గంగా అలజడులు జరుగుతుండాలి.  అప్పుడే ఇండియా వేరే విషయాలపై దృష్టిని సారించలేదని పాక్ అభిప్రాయం. పాక్ దురభిప్రాయాన్ని ముందుగానే పసిగట్టిన ఇండియా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది.  దీంతో ఇండియాలోకి ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లు తగ్గిపోయాయి.  దీంతో ఏం చేయాలో తెలియక పాక్ ఇలా తోకతెగినా కోతిలా చిందులు వేస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: