ప్రజాస్వామ్యంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ముందు ఆ సమస్య తీవ్రత తెలిసేలా కొన్ని ఆందోళనలు చేయడం తప్పనిసరి అవుతోంది. ఆందోళనలు జరగకుండా సమస్యలు పరిష్కారమయ్యే రోజులు పోయాయి. కాకపోతే ఆ ఆందోళనలు ఎంత వినూత్నంగా ఉంటే.. అంతగా జనం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అందు కోసం కొంత వింత వింత నిరసనలు చేస్తుంటారు.


తమిళనాడులో తాజాగా అదే జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో తిక్కురుని మహాదేవర్ అనే శైవ మందిరం ఉంది. తమిళనాడులో దేవాలయాలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. అందులోనూ ప్రతి దేవాలయానికీ చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటి గుళ్లలో ఒకటైన తిక్కురిని మహాదేవర్‌ శైవమందిరంలో ఏడాది క్రితం విగ్రహాలు మాయం అయ్యాయి.


అవి ఎలా మాయం అయ్యాయన్నది ఇప్పటికీ మిష్టరీగానే ఉంది. దోపిడీ దొంగల పనా.. లేక ఇంటి దొంగలే మాయం చేశారా అన్నది ఇప్పటకీ తేలలేదు. దొంగ తనం విషయం తెలియగానే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకోవడమే కానీ.. దొంగలెవరో మాత్రం కనిపెట్టలేకపోయారు. దాదాపు ఏడాది పాటు సహనం వహించిన గ్రామస్తులు దొంగలను పట్టుకోవాలంటూ పోలీసులపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.


అనుకున్నదే తడవుగా గ్రామస్తులంతా ఏకమై సమావేశం పెట్టుకున్నారు. ఆలయం నుంచి అదృశ్యమైన దేవుని విగ్రహాలను కనిపెట్టాలని కోరుతూ.. వింత నిరసన చేపట్టాన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే గ్రామస్థులు గుళ్ళు గీయించుకొని ఓ గేదెకు తమ ఫిర్యాదు అందజేశారు. ఈ విషయాన్ని ముందుగానే మీడియాకు వెళ్లడించడం వల్ల పబ్లిసిటీ కూడా బాగానే వచ్చింది. విగ్రహాల దొంగతనం విషయంలో ప్రభుత్వ, పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్థులు ఇలా గుండు చేసుకొని గేదెకు వారి గోడు వినిపించుకోడవం మీడియా దృష్టిని ఆకర్షించడంతో ఇప్పుడు లోకల్ గా అది హాట్ టాపిక్ అయ్యింది. మరి ఇకనైనా పోలీసులు ఆ దొంగల పని పడతారో లేదో..


మరింత సమాచారం తెలుసుకోండి: