రాష్ట్ర ప్రణాళిక బోర్డును రద్దు చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దైతే రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటు అవుతాయి. ప్రాంతీయ ప్రణాళిక బోర్డులలో మూడు సంవత్సరాల కాలపరిమితితో బోర్డ్ ఛైర్మన్ ను నియమిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృధ్ధి చేయాలనే లక్ష్యంతో నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. 
 
ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రం అన్ని విధాలుగా వృధ్ధి సాధిస్తుందని తెలుస్తుంది. ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల ద్వారా అభివృధ్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను నివారించి అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలను కల్పించటమే ప్రభుత్వ ఉద్దేశమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రం సర్వతోముఖాబివృధ్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రణాళిక బోర్డును రద్దు చేసి ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. 
 
విజయనగరం కేంద్రంగా ఒకటి, కాకినాడ కేంద్రంగా ఒకటి, గుంటూరు కేంద్రంగా మరొకటి, కడప కేంద్రంగా మరొక ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దుకు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రాంతీయ బోర్డుకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఆమోదం పొందితే ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు అవుతాయి. 
 
ప్రాంతీయ బోర్డుల ద్వారా ఆయా ప్రాంతాలలో ఉన్న అసమానతలను రూపు మాపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా ప్రజలను అభివృధ్ధి చేయటమే లక్ష్యంగా ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటు కాబోతున్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే వెంటనే ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు అవుతాయి.మారుమూల ప్రాంతాలను అభివృధ్ధి చేయటానికి కూడా ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు కృషి చేస్తాయని తెలుస్తుంది. ప్రాంతీయ బోర్డులలో ఛైర్మన్ తో పాటు ముఖ్యమైన రంగాలకు చెందిన నిపుణులు ఉండే అవకాశం ఉందని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: