అతను ముఖ్యమంత్రి పుత్రుడు.. ఓ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. అతను చిటికేస్తే ఫైవ్ స్టార్ హోటల్ లో టీ అతని కళ్ళముందు ఉంటుంది. కానీ అతనికి రోడ్డు పక్కన ఉన్న చాయ్ దుకాణంలో సామాన్యుడిలా చాయ్ తాగాలనిపించింది. అంతే ఒక్కసారిగా ఓ చిన్న చాయ్ దుకాణం ముందు కొన్ని కార్లు ఆగాయి. ఆ కార్ లో నుంచి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ దిగారు. 


అంతే ఆ దుకాణం యజమాని ఆనందానికి హద్దులు లేవు. ఎప్పుడు టీవిలో, పేపర్ లో అతని మంచితనం గురించి రాసింది చూడటమే కానీ అతన్ని చూసింది లేదు. అలాంటి గొప్ప నాయకుడు అతని టీ దుకాణంలోకి వచ్చి ఒకా వేడి ఛాయ్ ఇవ్వండి అని అడిగాడు. ఎంతో ఆనందంగా అతనికి ఛాయ్ ఇచ్చి ఆనందంతో పొంగి పోయాడు ఆ ఛాయ్ దుకాణ యజమాని. 


ఎప్పుడు సింప్లిసిటీతో ఆ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరగా ఉండే కేటీఆర్ ఒక్కసారిగా ఈ పని చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సమస్య ఉంది అని పిలిస్తే దేవుడైన పలుకుతాడో లేదో తెలియదు కానీ .. ట్విట్టర్ లో '' కేటీఆర్ అన్న నాకు సమస్య ఉంది అన్న, నాకు సహాయం చెయ్యండి.. చాలా ఇబ్బందులు పడుతున్న..'' అని ఓకే ట్విట్ చేస్తే.. 'నేను ఉన్న.. నీ సమస్యను పరిష్కరిస్తా' అంటూ ముందుకు వస్తాడు గొప్ప నాయకుడు కేటీఆర్.


ఒకప్పుడు ఇందిరా గాంధీ 'పూరి గుడిసెలోకి వెళ్లి .. ఓ పేదరాలు వండుతున్న వంటను తిని.. అద్భుతంగా ఉంది' అని చెప్పిన అనుభూతిని ఈరోజు ఆ ఛాయ్ దుకాణం యజమానికి ఇచ్చాడు కేటీఆర్. ఇంకన్నా సింప్లిసిటీ నాయకుడు ఎవరుంటారు.  ఇలాంటి నాయకులను చూసినప్పుడే అనిపిస్తుంది.. ప్రజలను కలవడానికి ఎన్నికల సమయంలోనే కాదు ఏ సమయంలో అయినా వచ్చే నాయకులూ ఉన్నారు అని. 


మరింత సమాచారం తెలుసుకోండి: