చిదంబరం అరస్ట్ విషయం ఇప్పుడు దేశమంతా సంచలన విషయంగా మారింది.చిదంబరం మీద సిబిఐది ఈడీ  కేసులను నమోదు చేసింది.అసలు ఈ కేసు ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరిగబోతున్నాయి అనే అంశం మీద అందరిలో మెదులుతున్న పశ్న. కానీ చిదంబరం అరెస్ట్ వెనకాల ఒక ఆడదాని హస్తం ఉందంట.ఆమె వల్లే చిదంబరం దొరికిపోయారంట.ఆమె ఎవరో కాదు. ఇంద్రాణి ముఖర్జీ ఇది దేశమంతా మారుమోగిన పేరు. ఆస్తి కోసం తన సొంత కుమార్తెను దారుణంగా కడతేర్చిన ఓ హంతకి పేరు. చిదంబరం చుట్టూ ఈడీ వల బిగుసు పోవటానికి కారణం ఇంద్రాణీయే. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ లో ఆమె, ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీ సహనిందితుల.



ఆ మీడియా సంస్థ పెట్టింది ఇంద్రాణీయే. పీటర్, చిదంబరం కుమారుడు కార్తీకి వ్యాపార సలహాదారుడు. ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకొని ఇంద్రాణి ఐఎన్ఎక్స్ కేసులో ఇరవై ఆరు శాతం వాటా అమ్మకానికి అనుమతి కోరారు. కానీ ఎఫ్ఐపీబీ తొలుత ఆమె దరఖాస్తును తిరస్కరించింది. చిదంబరం కూడా నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్ల మేర వాటా అమ్మకానికి అనుమతినిచ్చారు. ఆ సమయంలో కార్తీ ఓ బేరంపెట్టారు. విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఈ డీల్ కుదురుస్తానన్నది కార్తీ చిదంబరం పెట్టిన బేరం. ఇందుకు పీటర్ ఒప్పుకున్నారు. మనీ లాండరింగ్ ద్వారా ఎంత మొత్తాన్ని తరలించిందన్నది ఇంద్రాణి వెల్లడించకపోయినా దాదాపు మూడు వందల కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు ఐటి శాఖ వర్గా లు తెలిపాయి. తరవాత కార్తీని ఇంద్రాణి ఓ స్టార్ హోటల్ లో కలిసి పది లక్షల డాలర్ల మేర చెల్లించటానికి చర్చలు జరిపారు. చివరకు మూడున్నర కోట్ల చెల్లింపులకు ఒప్పందం కుదిరింది. ముఖర్జీ దంపతులు ఆ మొత్తాన్ని కార్తీ చిదంబరానికి సింగపూర్ లో ఉన్న సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్ కు ముట్టచెప్పారు.



ఈ వివరాలన్నింటినీ ఇంద్రాణి సిబిఐ దర్యాప్తులో బయటపెట్టేసి అప్రూవర్ గా మారారు. ముఖ్యంగా చిదంబరం పాత్రను ఆయనతో తన భేటీలోనూ ఆమె వివరంగా తేదీలతో సహా వివరించారు. రెండు భారతీయ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులకు అక్రమంగా అనుమతులు ఇప్పించి విదేశాల్లో భారీ ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం మెడకు మరో నాలుగు కంపెనీల అక్రమాలు చుట్టుకున్నాయి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా డిఆర్జియో స్కాట్లాండ్ లిమిటెడ్, ఖతారా హోల్డింగ్స్, ఎస్సార్ స్టీల్ లిమిటెడ్, ఎల్ పోర్ట్సు లిమిటెడ్, కంపెనీలో విదేశీ ప్రత్యక్ష  పెట్టుబడులకు చిదంబరం అక్రమంగా అనుమతులు ఇప్పించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తోంది . దాంతో ఆయనపై ఈడీ చేపట్టిన నల్లధనం చలామణి దర్యాప్తు మరింత ఊపందుకుంది . ఐఎన్ఎక్స్ మీడియా ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం కోసం చిదంబరం ఆయన తనయుడు కార్తీ చిదంబరం విదేశాలలో షెల్ కంపెనీల ద్వారా మూడు వందల కోట్లు ముడుపులు అందుకున్నారని ఈడీ ఆధారాల సంపాదించింది.


అక్రమ పెట్టుబడులకు అనుమతి ఇచ్చినందుకే ఈ మొత్తాలు ముట్టినట్టు ఈడీ ఆరోపిస్తోంది. వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తప్ప నిజాలు బయటకు రావు అని ఈడీ కోర్టు విన్నవించింది. చిదంబరం హయాంలో ఎఫ్ఐపీబీ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది తర్వాత బోర్డును రద్దు చేశారు. రెండు వేల పదిహెడు లో నమోదైన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి రెండు వేల పధ్ధెనిమిదిలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను ఢిల్లీ హై కోర్టు మంగళవారం రద్దు చేసింది. దాంతో చిదంబరానికి సంబంధించి ఇప్పటి దాకా చాప కింద నీరులాగా దర్యాప్తు జరిపిన కేంద్రం ఇపుడు పూర్తి వివరాలన బయటపెడుతోంది. చిదంబరం కార్తీ లు భారత్ లో ఇతర దేశాల్లో రెండు చోట్ల రిజిస్టరైన షెల్ కంపెనీల ద్వారా మూడు వందల కోట్లు స్వీకరించినట్లు ఈడీ చెబుతోంది.


ఈ డబ్బును తండ్రీ కొడుకులు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడమే కాకుండా విదేశీ బ్యాంకులలో రెండు ఖాతాలు తెరచి డిపాజిట్ చేసినట్టు ఈడీ తేల్చింది. ఆ మొత్తాల నుంచి మలేషియా బ్రిటన్ స్పెయిన్ లలో ఆస్తుల కొన్నట్టు నిర్ధారించింది. కార్తీ చిదంబరానికి చెందిన షెల్ కంపెనీకి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ నుంచి భారీ ఎత్తున చెల్లింపులు జరిగినట్టు పనామా పేపర్స్ లీకేజీ ద్వారా వెల్లడైంది. కార్తీ ఇల్లు కంపెనీల్లో జరిపిన సోదాల్లో పలు ఆధారాలు సంపాదించామని వాటిని  తేల్చే విషయంలో తండ్రీ కొడుకులు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటి వరకూ కార్తీ చిదంబరానికి సంబంధించి యాభై నాలుగు కోట్ల ఆస్తులను జప్తు చేశారు. అటు ముందస్తు బెయిల్ కోసం చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు శుక్రవారం విచారిస్తామన్నది. అయితే ఆయన అరెస్ట్ అయిపోయారు కాబట్టి అది రద్దీ పోయినట్లే నని న్యాయ నిపుణులు చెబూన్నారు. ఆయన ఇక రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించాల్సిందేనని అంటున్నారు. ఇకపై ఈ కేసు ఇంకెలాంటి  మలుపులు తిరగబోతోందో ఈ వల నుంచి బయటపడటానికి చిదంబరం ఎలాంటి వ్యూహాలు ఆలోచిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: