జగన్ ప్రభుత్వం రోజుకొక చర్యను చేపడుతోంది. తాజాగా పీపీఏ రద్దు తో సంచలనం సృష్టించబోగా పీఎంవో రంగంలోకి దిగగా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు .ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయటాన్ని కేంద్రం లోని మోదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పీపీఏ లన్నిటినీ తాము రద్దు చేయడం లేదని అవకతవకలు జరిగాయని ధ్రువీకరించిన ఒప్పందాలనే పునస్సమీక్షించనున్నామని కేంద్రానికి తెలియజేసింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్ కె సింగ్ విలేకరులకు తెలిపారు. ఇప్పటికే దేశంలో విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్న నేపధ్యంలో ఇప్పుడు పీపీఏ లు రద్దు చేస్తే విదేశీ ఇన్వెస్టర్ లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రధాన మంత్రి కార్యాలయం తాజాగా ఆయనకు లేఖ రాసింది.


మరోవైపు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే పీపీఏల సమీక్ష నిర్ణయం తీసుకున్నామని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించిన నేపథ్యం లో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏడు వేల ఏడు వందల మెగావాట్ల సౌర పవన ప్రాజెక్టులున్నాయని లేఖలో ప్రస్తావించారు. రెండు వేల ఇరవై రెండు కల్లా ఎనభై బిలియన్ డాలర్ల మేరకు ఈ రంగాల్లో పెట్టుబడులు సేకరించాలని కేంద్రం అంచనా వేస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. జగన్ ప్రభుత్వ నిర్ణయంతో తమ ప్రయత్నాలకు గండి పడే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. అందుకే కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని పీఎంవో కూడా రంగంలోకి దిగిందని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా అన్ని పీపీఎలను రద్దు చేయటం తప్పని పారదర్శకంగా వ్యవహరించకపోతే పెట్టుబడుల క్రమం అభివృద్ధి దెబ్బ తింటాయని సింగ్ తన లేఖలో స్పష్టం చేశారు.


అవినీతి జరిగిందని స్పష్టంగా తెలిస్తే తప్ప చట్టబద్ధంగా కుదుర్చు కున్న కాంట్రాక్టు ను విస్మరించలేమని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ కార్య దర్శి ఆనందకుమార్ చెప్పారు. ఆంధ్రా లో పీపీఏల రద్దును జపాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం ఆ దేశ రాయబారి కేంద్రానికి ఘాటుగా లేఖ రాశారు. దీంతో‌ పీఎంవో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జపాన్ కు చెందిన ఎస్ పీ ఎనర్జీ రెవెన్యూ సహా పలు కంపెనీలు ఏపీలో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఖరారైన ఒప్పందాల రద్దు చేయడాన్ని ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, ఐరోపా దేశాలు కూడా గమనిస్తున్నాయని జపాన్ తన లేఖలో హెచ్చరించింది.ఈ విషయం పై మోదీ మరియు జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వీటిపై జపాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరిలో ఆశక్తి మొదలైయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: