చాలా ట్రాఫిక్ నియమాలు ఉన్నపాటికి రోజు రోజుకు రోడు ప్రమాదాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. చాలా మంది పసిప్రాణాల సైతం పెద్ద వాళ్ళ నిర్లక్షానికి బలైపోతునే ఉన్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త ట్రాఫిక్ నియమాలను అమలు లోకి తెస్తోంది.వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఇక మీ జేబులు ఖాళీ కావటం ఖాయం. భారీ జరిమానాలతో తయారు చేసిన కొత్త చట్టం సెప్టెంబరు ఒకటవ తేదీ నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. న్యాయ శాఖ నుండి క్లియరెన్స్ తీసుకున్న వెంటనే వీటిని అమల్లోకి తెస్తామన్నారు గడ్కరీ.


కొత్త మోటారు వాహన చట్టం పై రాష్ట్రంలో ప్రజలకు అవగాహన కల్పిం చే కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. ట్రాఫిక్ నిబంధన లు పాటించం డి డబుల్ మిగిల్చుకోండి అంటూ హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాలో బోర్డులు పెట్టి మరీ పాజిటివ్ ప్రచారం చేస్తున్నారు . కేంద్ర చట్టాన్ని రాష్ట్రం అలవరచుకోవలసిన అవసరం ఉంది అంటూ తెలంగాణ న్యాయ శాఖ వర్గాలు వివరించాయి. దీనికి పెద్దగా సమయం పట్టద ని సాధారణంగా కేంద్రం నిర్ణయించిన తేదీ నుంచే అమలవుతుందని తెలిపాయి.కొత్త చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. జరిమానాలను అయిదు నుండి పది రెట్లు పెంచారు. జైలు శిక్ష కూడా విధిం చేందుకు త్వరలో న్యాయశాఖకు రవాణా శాఖ ప్రతిపాదనలు పంపనుంది. మైనర్ లు వాహనాలు నడిపితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా. ఆటోలు ఎక్కువ మంది కూర్చుంటే ఇరవై వేల జరిమానా. అక్కడికక్కడే  ప్రయాణికులనుదించి వారిని ప్రత్యామ్నాయ వాహనాల్లో గమ్యానికి చేర్చాలి .



అప్పటి వరకు సదరు ఆటోను అక్కడే నిలిపివేయాలి. వాహనాన్ని రిజిస్ర్టేషన్ చేయించుకోకపోతే యజమానికి వార్షిక రోడ్డు పనులకు ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. డీలర్ పై పదిహెడు రెట్లు జరిమానా పడుతుంది. వాహనంలో పద్నాలుగు ఎందుకంటే చిన్న పిల్లలున్నప్పుడు సురక్షిత బెల్ట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి లేదంటే వెయ్యి రూపాయల జరిమానా. పరిమాణానికి మించి ఓవర్ సైజ్డ్ వాహనాలకు ఐదు వేల వరకు జరిమానా విధిస్తారు లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఏకంగా లక్ష వరకు జరిమానా విధించే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: