తిరుమలలో దళారుల అవతారమెత్తిన వారి ఆట కట్టించారు పోలీసులు. ప్రజా ప్రతినిధుల పీఆర్ వోల పేర్లతో చలామణీ అవుతూ, అక్రమాలకు పాల్పడుతున్న దళారులను కటకటాల పాలు చేశారు. తిరుమలలో గత కొన్ని రోజులుగా పలువురు దళారులుగా మారి అందినకాడికి దండుకుంటున్నారు. తాము ప్రజాప్రతిధులు పీఆర్ వోల మంటూ పైకి చెబుతూ పని కానిచ్చేస్తున్నారు. ప్రజాప్రతిధుల లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ లను పొందుతున్నారు. ఇలా పొందిన బ్రేక్ దర్శనం టికెట్ లను దళారులు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.



ఈ దందాను పసిగట్టిన పోలీసులు దళాలను గుర్తించి, అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. భక్తుల విశ్వాసాన్ని దళారులు అందని కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమలలో దళారుల అవతారమెత్తిన వారి ఆటకట్టించారు చివరకు పోలీసులు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిటిడి పాలకమండలి కావచ్చు అదే విధంగా ప్రత్యేక అధికారిగా నియమించిన దళాలు కావచ్చు, వీళ్ళు పూర్తిగా కూడా దళారి వ్యవస్థ పైన నిఘా  పెట్టారని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించే భాగంగా గత వారం రోజులుగా ప్రజా ప్రతినిధులు సిఫార్స్ లేఖలపై టికెట్ లను పొందుతున్నారు.



వాటి ద్వారా వివరాలను పొందుతూ వస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ఆలయం లోపలకి వెళ్ళి సందర్శించుకుని భక్తులు బయటకు వచ్చే సమయంలో భక్తులను ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రజాప్రతినిధులకు మీకున్న సంబంధాలేంటి, మీకు అసలు ఈ సిఫార్సు లేఖలు ఎవరిచ్చారు, వీటి పైన ఎంత మేర డబ్బు చెల్లించారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సుమారు పది మందికి పైగా దళారులను ఇప్పటికే టిటిడి వ్యవస్థ అదుపులోకి తీసుకుంది. వాళ్ళను గోప్యంగా విచారిస్తోంది. అసలు వీరికి ప్రజాప్రతిధులకు ఉన్న సంబంధాలేంటి, అసలైన లేఖలా లేక నకిలీ లేఖలా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో దళారులను పూర్తిగా నిర్మూలించి, భక్తులకు మెరుగైన సేవలను అందించే దిశగా ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: