ఏపీ రాజకీయాల్లో రోజుకోక మలుపు తిరుగుతోంది.ఏపిలో తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య అంతర్గత యుద్ధం జరుగుతుంది. ప్రస్తుతమైతే నలుగురు రాజ్యసభ సంబంధించినటువంటి ఎంపీలు తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలోకి వెళ్లారు. వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా బిజెపి పెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ల కదలికల మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా నిఘా పెట్టారు. అలాగే విశ్లేషిస్తూ ఉన్నారు కూడా చంద్రబాబునాయుడు యాంగిల్ లో చంద్రబాబు నాయుడుకు మద్దతిస్తూ సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి మోహనరావు ఈ నలుగురు కూడా మాట్లాడుతున్నారనేటువంటి విషయాన్ని ఇప్పుడు బిజెపి గమనిస్తూ ఉంది. వాళ్లు బిజెపిలోకి వచ్చి చంద్రబాబునాయుడు మద్దతిస్తూ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.


జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అటు కన్నా లక్ష్మనారాయణ గాని లేదా పురందరేశ్వరి గానే బిజెపి లో ఉండేటువంటి లీడర్లందరు కూడా ఆ నలుగురి మీద ఏకాగ్రత చేశారు. చంద్రబాబు నాయుడుకు మద్దతు పలుకుతూ వాళ్లు జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. బిజెపి భుజం మీద తుపాకి పెట్టి జగన్ మోహన్ రెడ్డిని కాల్చాలనేటువంటి ప్రయత్నం సుజనా చౌదరి, సీఎం రమేష్ చేస్తూ ఉన్నారని ఇపుడు బిజెపిలోనే అంతర్గతంగా మాట్టాడుకుంటున్నారు. అమరావతి విషయంలో గాని వాలింటర్ల విషయంలో గాని ఇసుక టెండర్ల విషయంలో గానీ తాజాగా అమెరికాలో పర్యటిస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వాలన విషయంలో కూడా సీఎం రమేష్ అలాగే సుజనా చౌదరి ఇద్దరు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది ఇపుడు బిజెపిలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.


బిజెపి సిద్ధాంతానికి బిజెపి విధానాలకు విరుద్ధంగా ఈ నలుగురు ఎంపీలు కూడా వ్యవహరిస్తూన్నారనేటువంటి ప్రచారం అంతర్గతంగా చర్చ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో రాబోయే రెండు రోజుల్లో ఈ నలుగురి పై వ్యాపారం ఏ విధంగా ఉండబోతుంది బిజెపిలో అనేది చూడాలి.  ఆ నలుగురు మీద ఇప్పుడు బిజెపి ఏపి బిజెపిని మాత్రం ఏకాగ్రత చేసింది. ఆ నలుగురు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనకున్నటువంటి నిగూఢ అర్థాన్ని అధ్యాయనం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజులలో ఈ నలుగురిని కూడా కట్టడి చేయకపోతే బిజెపి భుజం మీద తుపాకి పెట్టి జగన్మోహనరెడ్డిని కాల్చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నటువంటి ఈ నలుగురు ఎంపిల యెక్క వాలకాన్ని ఇప్పుడు అధిష్టానం దృష్టికి ఏపి బిజెపి తీసుకువెళుతుంది. ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ నలుగురు యొక్క భవిష్యత్ ఏంటనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: