బ్రతికినన్ని నాళ్లు బతకడం కోసం,బ్రతుకుతో ఆరాటం పోరాటం.ప్రాణం పోసుకున్న వాడు కదలడం మొదలు పెట్టగానే వాడిపేరు మనిషని అంటారు,అదే ఊపిరి తీయకుండ వుండే శవం అంటారు.పేరున్న వాడైన,పేదవాడైన శ్వాస ఉన్నంత వరకే గుర్తింపు..మిద్దలు మేడలు ఏవి వెంటరావు,కులాలు,మతాలు కడుపునింపి కన్నీరు కార్చవు.ఇక కూడు,గూడు,గుడ్డ వీటికున్న కుల మేంటి.ఇలాంటివి ఎన్నైన మాట్లాడుకుంటాం,కష్టమనేది ఊపిరున్ననాళ్ళే అని నీతులు చెబుతాం,కానీ మరణించాక అంత్యక్రియల కోసం పోరాడాల్సిన దుస్థితి తలెత్తితే..అదెంతో బాధాకరం కదూ..?



అదెంతో బాధాకరం కదూ.తమిళనాడులోని వెల్లూరు జిల్లా వాణింబాడి సమీపంలోని నారాయణపురంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.నారాయణపురం గ్రామస్థులు,మృతదేహాలను శ్మశానానికి తీసుకెళ్లడానికి దారి లేదు.దీంతో పొలాల మీదుగా తీసుకెళ్లాల్సి వస్తుంది.కానీ అగ్రవర్ణాలకు చెందిన పొలాల యజమానులు దళితుల శవాలను తమ పొలాల మీదుగా తీసుకెళ్ల డానికి అంగీకరించడం లేదు.దీంతో శవాలను 20 అడుగుల బ్రిడ్జి మీది నుంచి తాళ్ల సాయంతో కిందకు దింపి అంత్యక్రియలు పూర్తి చేయవలసి వస్తుందని కన్నీటిపర్యంతం అవుతున్నారు.బ్రతుకుతూ సుఖపడలే మరణించాకైన హాయిగా శ్మశానానికి వెళ్లుతాడనుకుంటే కుల వివక్ష శవాలను కూడ వదలడం లేదని వాపోతున్నారు,చెప్పలేని వేదన చెందుతున్నారు.ఈ సంఘటన చదివితే  ఇంతకు మనం టెక్నాలాజీ యుగంలోనే వున్నామా అనే డౌట్ వస్తుంది కదూ..?




కుప్పన్ అనే దళితుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా,దహనసంస్కారాల కోసం శవాన్ని శ్మశానవాటికకు పంట పొలాల మీదుగా తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలకు చెందిన వారు అంగీకరించ లేదట,దీంతో చేసేదేమిలేక బ్రిడ్జి మీది నుంచి మృతదేహాన్ని కిందకు దింపే క్రమంలో తాళ్లు తెగి శవం కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. శ్మశానవాటికకు వెళ్లడం కోసం దారి ఇవ్వాలని ఏళ్ల తరబడి కోరుతున్నప్పటికీ..అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.మనమంతా ఒక్కటే,కులం లేదు మతం లేదు మనం మనం భారతీయులం అనే నాయకుల కళ్ళకు ఈ సంఘటన కనిపించడంలేదా అని చెవులు కొరుక్కుంటున్నారు ఈ సంగతి తెలిసిన జనం..

మరింత సమాచారం తెలుసుకోండి: