ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా  అమరావతి ని కాదని మరొక ప్రాంతం లో  రాజధాని ఏర్పాటు చేస్తారా?  అంటే  అవుననే వైకాపా వర్గాల నుంచి సమాధానమే వినిపిస్తోంది. అమరావతి నిర్మాణం పై   మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి .  అమరావతి ని  రాజధానిగా కొనసాగిస్తే భవిష్యత్తు లో   వరద ముంపు కు  అవకాశం ఉంటుందని  బొత్స చేసిన  వ్యాఖ్యలు హాట్ టాఫిక్ మారాయి .  ఏపీ నూతన  రాజధాని గా అమరావతిని ప్రకటిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే . రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించడం తో పాటు , వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి  మౌలిక వసతులు కల్పించడం తో పాటు, పలు భవనాలను నిర్మాణాన్ని ప్రారంభించింది .


 అయితే ఇప్పుడు  ఏపీ రాజధాని అమరావతి నుంచి ఇతర ప్రాంతానికి  తరలిస్తారనే  ఊహాగానాలు ప్రారంభమయ్యే సరికి తమ  ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలంటూ పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.  తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ తిరుపతి ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.  ఈ మేరకు తాను గతంలో ప్రధానమంత్రి కూడా లేఖ రాశానని ఆయన పేర్కొన్నారు.  అలాగే వైకాపా నేత ఎస్వీ మోహన్ రెడ్డి  మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు ను  నూతన రాజధాని గా ప్రకటించాలని కోరారు .  నూతన రాజధానిగా  అమరావతిని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కేవలం కొందరి కోసమే రాజధానిగా ప్రకటించడం జరిగిందని ఆయన ఆరోపించారు.


  ఏపీ ప్రభుత్వం నూతన  రాజధాని గా అమరావతిని కొనసాగిస్తుందా ?, లేక మరొక ప్రాంతాన్ని ప్రకటిస్తుందా ? అన్నదానిపై   స్పష్టత ఇవ్వకపోవడం పట్ల విపక్షాలు  తీవ్రంగా మండిపడుతున్నాయి .  రాజధాని మార్పు అనే అంశాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు జగన్మోహన్ రెడ్డి  ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరికీ తెలిసేలా నిర్ణయం తీసుకుంటారని.  తమ ప్రభుత్వ నిర్ణయాల్లో  దాపరికం ఉండదని  పేర్కొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: