చంద్రబాబుది ఐరన్ లెగ్గా. ఆయన ఎవరితో దోస్తీ చేసినా ఇంతే సంగతులా. అవతల పార్టీ నిండా మునగాల్సిందేనా. నిన్నటి ఎన్నికల్లో బాబు పక్కనుండి ప్రచారం చేసిన వారి సంగతి కూడా అదే కదా అంటున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ ఘోరంగా దెబ్బతిన్నారు. ఢిల్లీలో కేజ్రీవాలా కధ చెప్పక్కర్లేదు. యూపీలో అఖిలేష్ యాదవ్ చతికిలపడితే, కర్నాటకలో కుమారస్వామి ఏకంగా పదవే పోగొట్టుకున్నారు.



వీరే కాదు, ఏపీకి వచ్చి బాబు పక్కన నిలబడిన పాపానికి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఏకంగా రాష్ట్రాన్నే పోగొట్టుకున్నారు. ముక్కలైన కాశ్మీర్లో ఆయన పొలిటికల్ కెరీర్ మొత్తానికి  మొత్తం అంతమైంది ఇక శరద్ పవార్ విషయానికి వస్తే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా క్యూ కట్టి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇక రాహుల్ గాంధి అయితే ఏకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఏమీ కానివాడైపోయారు. పైగా ఆయన తండ్రి కాలం నుంచి వస్తున్న అమేధీ సీటుని కూడా దారుణంగా కోల్పోయారు.


ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోకటి ఉంది. అదే లేటెస్ట్ గా చిదంబరం ఏకంగా జైల్ వూచలు లెక్కబెట్టే పరిస్థితికి వచ్చారు. ఆయన బాబుకు చీకటి దోస్త్ అంటారని ప్రచారంలో ఉంది. వామ్మో బాబు తాను ఏపీలో ఘోరంగా దెబ్బ తినడమే కాకుండా ఇంతమందిని మట్టికరిపించారా. ఇది నిజం బాబుది ఐరన్ లెగ్గు అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన ట్విట్టర్లో బాబు మీద చేసిన కామెంట్స్ చూస్తే బాబు నిజంగా ఐరన్ లెగ్గే అనిపిస్తుందంటున్నారు.


‘బాబు గారు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాధృచ్ఛికమేమీ కాదు. పాద మహిమ అలాంటిది. ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలొచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు  పార్టీ మారుతుంటే శరద్ పవార్ గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి’అని ఆయన ట్వీట్‌ చేశారు. మొత్తానికి ఈ లెవెల్లో బాబు గారిమీద కామెంట్స్ చేయడం విజయసాయికే చెల్లు అనిపిస్తుంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: