ఆదిమానవుడి నుంచి మనిషి నేటి ఆధునిక మానవుడిగా ఎదిగిన క్రమం చూస్తుంటే అద్భుతం అని చెప్పొచ్చు.  మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు.  మనిషి అభివృద్ధికి మూలకారణం అతని ఆలోచన.  కేవలం మనిషి మాత్రమే అలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు.  అలోచించి నిర్ణయం తీసుకునే శక్తి మనిషికి మాత్రమే ఉన్నది కాబట్టి.. అభివృద్ధి చెందాడు.  టెక్నాలజీని అధివృద్ది చేసుకున్నాడు.  


రోదసీలోకి వెళ్లగలుగుతున్నాడు.  ఇప్పుడు మరోఅడుగు ముందుకు వేసి.. చంద్రునిపై కూడా కాలుపెట్టాడు.  అంగారక గ్రహం మీదకు రాకెట్లను పంపుతున్నాడు.  ఇక ఇంట్లో పనుల కోసం ప్రొగ్రమింగ్ చేసిన రోబోలను వాడుతున్నారు.  మనిషి సౌలభ్యం కోసం పని భారాన్ని తగ్గించుకోవడం కోసం ఇలా రోబోలను వాడుకుంటున్నారు.  అంతవరకూ బాగానే ఉన్నది. కానీ, ఇప్పుడు మనిషి అంతకు మించి ఆలోచిస్తున్నాడు.  ఎలాగో తెలుసా.. రజినీకాంత్ రోబో సినిమాలో లాగ. 


ఆర్టిఫీషియల్ ఇంటిలిజెంట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాడు.  దీనివలన ప్రస్తుతం మనిషికి ఎన్నో లాభాలు ఉన్నాయి.  దీనిపై ఇప్పుడు పరిశోధన జరుగుతున్నది.  ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెంట్ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందితే.. మానవాళికి ముప్పు వాటిల్లుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  ప్రస్తుతం ప్రపంచం అభివృద్ధి చేస్తున్న రోబోలు మనిషి చేసిన ప్రోగ్రాం మీదనే ఆధారపడి పనిచేస్తున్నాయి.  కానీ, మనిషి ఓ అడుగు ముందుకు వేసి.. మనిషిలా ఆలోచించే రోబోలను తయారు చేస్తేనే కష్టం.  


వీటిపై ఇటీవలే కొన్ని పరిశోధనలు జరిగాయి.  మనిషిలా అలోచించి అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తిగలిగిన రోబోల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారని సమాచారం.  వీటిని రోదసిలోనూ, సైన్యం రక్షణలోనూ వినియోగించాలని అనుకుంటున్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  కానీ, ఒకేసారి ఇది అదుపుతప్పిందా.. ఇక అంతే సంగతులు.. అణుబాంబు కన్నా.. ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెంట్ రోబోలు డేంజర్.  మనిషి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.  అమెరికా, రష్యా, జపాన్ దేశాలు ఈ రోబోల తయారీపై దృష్టిపెట్టాయి.  స్పెస్ లో అమెరికా,రష్యాల మధ్య పోటీ ఉన్నది.  ఈ రెండు దేశాలు ఈరకం రోబోల తయారు చేస్తున్నట్టు వినికిడి.  


మరింత సమాచారం తెలుసుకోండి: