కర్ణాటకలో కాంగ్రెస్  జేడీస్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత బొటా బొటి మెజారిటీ తో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేలు ను స్పీకర్ అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే బల పరీక్షలో నెగ్గిన బీజేపీ .. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వానికి పట్టిన గతి తమకు కూడా పడుతుందని బీజేపీ ఇప్పుడు భయపడుతుంది. ప్రస్తుతానికి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసింది గాని ఇంకా పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు.


ఇప్పటీకే మంత్రి వర్గంలో చోటు దక్కని వారు చాలా అసంతృప్తితో రగిలి పోతున్నారంటా ..  ఎక్కడ అసంతృప్తి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనని యెడ్యూరప్ప సర్కార్ కు ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. అయితే తిరుబాటు చేసిన ఫర్వాలేదు గాని ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. దీనితో యెడ్యూరప్ప ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి.


అయితే మంత్రి వర్గ సమయంలో సుమారు 7 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని సమాచారం వచ్చిందంటా .. దీనితో మంత్రి వర్గ పూర్తి స్థాయి విస్తరణ బీజేపీకి కత్తి మీద సాము లాగా తయారైందటా .. ఇదే విధంగా కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి పోవటంతో ఇప్పుడు బీజేపీ వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే కొన్ని ఖాళీలను మంత్రి వర్గంలో అలానే ఉంచింది. దీనితో మిగతా వారిని సంతృప్తి పరిచే పనిలో పడ్డారు బీజేపీ సీఎం. ఏదైనా తేడా జరిగితే అధికారం కోల్పోతామేమోనని బీజేపీ తీవ్రంగా ఆలోచిస్తుంది. అయితే మంత్రి వర్గంలో స్థానం కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయంటా .. ఇప్పటి నుంచే  ఎమ్మెల్యేలు లాబీయింగ్ కు సిద్దపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: